Samantha : సమంతను దెబ్బతీసేందుకు నాగ చైతన్యకు జై కొట్టిన సీనియర్ హీరోయిన్..

Authored By mallesh | The Telugu News | Published on: October 15, 2022, 1:00 pm

Samantha : తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు, హీరోయిన్ల మధ్యన పిచ్చ కాంపిటేషన్ ఉంటుంది. తమకు అపోజిట్ హీరో లేదా హీరోయిన్ సినిమా హిట్ అయ్యిందంటే తనది ఎందుకు కాలేదని కొందరు తమలో తాము సతమతం అవుతుంటారు. ఒక్కోసారి వారు విజయం సాధించేందుకు తోటి నటుడు, లేదా నటి సాయం కూడా తీసుకుంటారు. అనగా ఆ హీరో లేదా హీరోయిన్ కోసం మంచి గుర్తింపు పొందిన నటులు అతిథి పాత్రలో కనిపిస్తుంటారు. తాజాగా చైతూ కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ ముందుకొచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి చైతూకు సరైన హిట్ పడలేదు.

దీనికి తోడు సామ్ ఏదో ఒకటి తన మాజీ భర్తను టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తూనే ఉంది. రీసెంట్‌గా యు నెవర్ వాక్ అలోన్ అని టీషర్ట్ వేసుకుని ట్వీట్ చేసింది. ఇవన్నీ చైతూ కోసమే అని చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలు ప్లాప్ అయి చైతూ నరకయాతన అనుభవిస్తుంటే సామ్ ఇలా కార్నర్ చేయడం సరికాదని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా నాగార్జున, నాగచైతన్య అభిమానులు సంతోషించే విషయం చెప్పారు దర్శకుడు వెంకట్ ప్రభు. సరైన హిట్స్ లేక అల్లాడి పోతున్న చైతూకు ఈ వార్త నిజంగానే కాస్త ఊరటను ఇస్తుంది. వ్యక్తిగతంగానే కాదు సినిమా పరంగా కూడా చైతూ ఈ మధ్య ట్రోలింగ్‌కి గురవుతున్నాడు.

Naga Chaitanya to killed Samantha

Naga Chaitanya to killed Samantha

Samantha : సమంతకు చెక్ పెట్టేస్తుందా ఈ నటి..

నాగచైతన్యకు ఒక్క హిట్ పడితే చాలు అంతా సెట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు సమంతకు, ఇటు ట్రోలర్స్‌కు చెక్ పెట్టేందుకు వెంకట్ ప్రభు ప్రియమణిని రంగంలోకి దించాడట. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ, థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలు పెద్ద ఆడలేదు. ఇప్పుడు అందరి కళ్ళు వెంకట్ ప్రభు సినిమా పైనే ఉన్నాయి. చైతూ ఆశలు కూడా దీనిపైనే ఉన్నాయట..రీసెంట్‌గా షూటింగ్ ప్రారంభం అయ్యింది.కానీ అనుకోకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఘటనలో చిత్రం బృందం చిక్కుల్లో పడింది. అయితే, సమంతను దెబ్బతీయాలంటే ప్రియమణి అవసరం అని మూవీ టీం భావించిందట.. సామ్, ప్రియమణి గతంలో ది ఫ్యామిలీ మెన్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp