Home » Entertainment » Naga Chaitanya Told Good News To Akkineni Fans
Entertainment

Naga Chaitanya : అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ చెప్పనున్న నాగచైతన్య..!

Authored By
mallesh
The Telugu News | Updated on: October 20, 2021, 3:30 pm
Advertisement

Naga Chaitanya : సామ్ చై విడాకుల తర్వాత అక్కినేని కుటుంబం పెద్దగా బయట కనిపించడం లేదు. మా ఎన్నికల సమయంలోనూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నాగ్ కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. అక్కినేని కుటుంబం మొత్తం బాధలో మునిగిపోయిందని జోరుగా వార్తలు హల్ చల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయినా.. ఆ సినిమా ఎలా ఉందనే విషయంపై నాగ్ ఫ్యామిలీ, కనీసం అఖిల్ కూడా స్పందించకపోవడం గమనార్హం. దీనిని బట్టి అక్కినేని ఫ్యామిలీ కొద్దిరోజుల పాటు ఇండస్ట్రీతో గ్యాప్ మెయింటెన్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

నాగచైతన్య తన వివాహ బంధానికి వీడ్కోలు పలికాక వరుస సినిమాలకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల లవ్‌స్టోరితో వచ్చిన చైతూ ఆ సినిమా ఆశించినంత పెద్ద విజయాన్ని అందించలేకపోయింది. తాజాగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’. మూవీలో నటిస్తున్నాడు అక్కినేని నటవారసుడు. అయితే, ఈ చిత్రం పెద్దగా బ్రేక్స్ లేకుండా శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని థాంక్యూ మూవీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తన సోషల్ మీడియాలో వెల్లడించాడు.

nagachaitanya

Advertisement

Naga Chaitanya : అక్కినేని అభిమానులకు ఇక పండుగే…

గతంతో అక్కినేని కుటుంబంతో విక్రమ్ కే కుమార్ కుమార్ విడదీయరాని బంధం ఉంది. ‘మనం’ సినిమా తర్వాత అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా ‘హలో’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్. కానీ, అది ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం చైతూతో ‘థాంక్యూ’ చిత్రాన్ని తీశాడు. అయితే, ఈ మూవీపై చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉన్నది.

అంతేకాకుండా, అనుకున్న సమయానికి కంటే చిత్రీకరణ పూర్తిచేసుకుని థియేటర్లలో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.ఈ మూవీ అనంతరం చైతన్య ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమాకు ఓకే చెప్పాడని టాక్. అంతేకాకుండా నిర్మాత, దర్శకుడు అర్జున్ ఇటీవల నాగ చైతన్యకు ఓ కథను వినిపించాడట. అది చైతూకు బాగా నచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనున్నట్టు ఫిలిం వర్గాల టాక్.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి