Home » Entertainment » Emmanuel On Varsha Surgery In Jabardasth
Entertainment

Varsha : నీకు ఆ సర్జరీ చేయించాలి.. వర్ష పరువుతీసిన ఇమాన్యుయేల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 16, 2021, 5:10 pm
Advertisement

Varsha బుల్లితెరపై వర్ష, ఇమాన్యుయేల్ ఎంతలా హల్చల్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో ఈ జోడి నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉండేది. కానీ ఏదైనా సరే విషమిస్తే వెగటు పుడుతుంది అన్నట్టుగా.. ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ మీద యాక్ట్ చేయడమే కాకుండా ఆఫ్ స్క్రీన్ మీద కూడా హల్చల్ చేయడం ప్రారంభించారు. ఓ ఈవెంట్‌లో భాగంగా వర్ష, ఇమాన్యుయేల్‌కు మల్లెమాల టీం పెళ్లి చేసింది.

Advertisement

Emmanuel On Varsha Surgery In Jabardasth

అప్పటి నుంచి జనాలు ఈ జోడిపై విపరీతమైన ట్రోలింగ్ ప్రారంభించారు. దాంతో ఈ ఇద్దరు ఇప్పటి వరకు మళ్లీ రొమాన్స్, లవ్ అంటూ స్కిట్ చేయలేదు. అయితే తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో ఈ ఇద్దరూ బుల్లెట్ భాస్కర్ టీంలో దుమ్ములేపుతున్నారు. నిన్న జరిగిన ఈ ఎపిసోడ్ వారి స్కిట్ అదిరిపోయింది. అందులో వర్ష మీద వరుసగా పంచులు వేసి పరువుతీశాడు.

Advertisement

Varsha వర్షను ఆడుకున్న ఇమాన్యుయేల్

Emmanuel On Varsha Surgery In Jabardasth

నేను ఈ గెటప్పులో అందంగా ఉన్నానా? అంటూ వర్ష అనడం.. ఈ గెటప్పు బాగుందని నీకు చెప్పి.. నువ్ లేడీ గెటప్ కాదని నేను బయట చెప్పి.. అన్నీ నేనే చెప్పలేకపోతోన్నాను అని ఇమాన్యుయేల్ కౌంటర్ వేశాడు. నేను ఏదైనా సర్జరీ చేసుకోవాలా? ఫేస్ బాగా లేదా? అని వర్ష మరోసారి అడుగుతుంది. నీకు ఫేస్ సర్జరీ కాదు.. ముందు ఆ గొంతు సర్జరీ చేయాలి.. అది మగ గొంతో ఆడ గొంతే తెలియక చస్తున్నా అంటూ వర్ష పరువు తీశాడు ఇమాన్యుయేల్.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి