Naga shourya : ఆ హీరోయిన్‌తో రోమాన్స్ చేయాల‌ని ఉంద‌ట‌… స్టేజీపైనే నాగ శౌర్య హాట్ కామెంట్స్..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 2, 2021, 9:40 pm

Naga shourya : నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘లక్ష్య’. డిసెంబర్ 10న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను సీనియర్ హీరో విక్ట‌రి వెంక‌టేష్ చేతుల మీదుగా విడుద‌ల‌ చేశారు. కార్యక్రమంలో చిత్ర హీరో నాగ శౌర్య మాట్లాడుతూ.. లక్ష్య సినిమా కోసం రెండున్నరేళ్లుగా చాలా కష్టపడినట్లు తెలిపారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలిపారు. సంగీత దర్శకుడు కాళ భైరవ తన స్నేహితుడంటూ ఐదేళ్ల నుంచి అతనితో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాళ భైరవ సమకూర్చిన నేపథ్య సంగీతం… ఈ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హీరోయిన్ కేతిక శర్మ గురించి మాట్లాడుతూ.. రొమాంటిక్ సినిమాలో లాగే ఆమె ఈ చిత్రం లో అందంతో ఆకట్టుకుంటుందని అన్నారు. కేతిక లాంటి గ్లామర్ డాల్ ను చూస్తే నాకే కాదు.. ఎవ్వరికైనా సరే రొమాన్స్ చేయాలనిపిస్తుందని ఏ మొహమాటం లేకుండా చెప్పారు. ఏ హీరోయిన్ కూడా ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే ఇంత అభిమానాన్ని సంపాదించుకాలేదన్నారు. అలాగే ఈ చిత్రంలో జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ గారితో కలిసి నటించడం తనకు గర్వంగా ఉందంటూ.. వారి పాత్రలు ఆధ్యంతం అలరించేలా ఉంటాయని వివరించారు.

Naga shourya About on Ketika Sharma

Naga shourya About on Ketika Sharma

Naga shourya : కేతికతో రొమాన్స్ చేయాలనిపిస్తుంది:

సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ శౌర్య వరుడు కావలెను మూవీతో ఇటీవల డీసెంట్ హిట్ కొట్టారు. ఈ మేరకు రాబోయే లక్ష్య సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp