Nagababu about Pawan Kalyan At Niharika Wedding
మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఉండి తీరాల్సిందే. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ లేకపోయినా అది అసంపూర్ణమే. నిహారిక పెళ్లి సెలెబ్రేషన్స్‌లో ఇప్పటి వరకు అదే అసంతృప్తి అందరిలోనూ ఉంది. పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లి సంబరాల్లో కనిపించకపోయే సరికి అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. నిహారిక పెళ్లి పనులు,సంబరాలు మొదలై వారం రోజులు అవుతున్నాయి. ఈ వేడుకల్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు.
Nagababu about Pawan Kalyan At Niharika Wedding
నిహారికను పెళ్లి కూతురిని చేసిన ఈవెంట్‌లో చిరంజీవి సందడి చేశాడు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వస్తాడేమోనని అందరూ అనుకున్నారు. కానీ రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ లేకపోయినా కూడా పిల్లలుంటారని అంతా భావించారు. కానీ ఆద్య, అకీరాలు కూడా కనపడలేదు. పైగా అన్నా లెజినోవా ఫ్యామిలీ కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఇక నేరుగా పెళ్లికే వెళ్తాడని అంతా ఫిక్స్ అయ్యాడు. చివరకు అదే నిజమైంది.
నేటి సాయంత్రం పవన్ కళ్యాణ్ తన పిల్లలు ఆద్య, అకీరా నందన్‌లతో కలిసి ఉదయ్ పూర్‌కు బయల్దేరాడు. ఇక ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్‌ను నాగబాబు దగ్గరుండి మరీ తీసుకెళ్లినట్టున్నాడు. పవన్ కళ్యాణ్‌ను ప్యాలెస్ లోపలికి తీసుకెళ్తున్నాడు. ఆ ఫోటోను షేర్ చేసిన నాగబాబు అదిరిపోయే కామెంట్ చేశాడు. ఈ మూమెంట్‌ను పరిపూర్ణం చేసేందుకు మా చివరి సంతోషం కూడా వచ్చేసిందంటూ తమ్ముడిపై ప్రేమను కురిపించాడు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.