nagarjuna finalised his daughter in law for akhil
Nagarjuna : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, సమంత డైవోర్స్ గురించి అందరికీ తెలుసు. సమంత, నాగచైతన్య విడిపోకూడదని చాలా మంది అనుకున్నారు. కానీ, వారి విడాకులు అయిపోయింది. ఇద్దరూ ఎవరి దారిలో వారు ప్రొఫెషనల్ గా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని ఇంటికి కోడలు ఎవరూ లేరని భావించిన నాగార్జున .. ఇంటికి కొత్త కోడలును తీసుకురావాలని ఆలోచిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.నాగార్జున చిన్న కొడుకు అఖిల్ మ్యారేజ్ అప్పట్లో కన్ఫర్మ్ అయిన సంగతి అందరికీ తెలుసు.
ఓ పెద్దింటి అమ్మాయిని అనుకుని, గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. కానీ, పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. అలా నాగార్జున ఇంటికి చిన్న కోడలిగా రాబోయే అదృష్టం ఆ అమ్మాయికి లేకుండా పోయింది. ఇక ఇంటికి కోడలిగా వచ్చిన సమంత.. కొద్ది రోజులకే వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త కోడలిని నాగార్జున తీసుకురావాలని అనుకుంటున్నారట.నాగచైతన్య, సమంత విడిపోయినప్పటికీ డైవోర్స్ ఇంకా రాలేదని, అది వచ్చిన తర్వాత తన ఇంటికి రాబోయే చిన్న కోడలు గురించి నాగార్జున ప్రకటిస్తారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
nagarjuna finalised his daughter in law for akhil
నాగార్జున ఇంటికి రాబోయే చిన్న కోడలు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేని అమ్మాయి అట. అటువంటి అమ్మాయిని నాగార్జున ఆల్రెడీ ఫిక్స్ చేశారని టాక్. చూడాలి మరి..ఈ వార్తలో నిజమెంతుందో.. ఇకపోతే నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో నాగార్జున, నాగ చైతన్య, హీరోయిన్ కృతిశెట్టి, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల , మూవీ యూనిట్ సభ్యులు పాల్గొంటున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపైన భారీ అంచనాలే ఉన్నాయి.
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.