
Telugu Movies following the same trend Stories of kings
Tollywood : టాలీవుడ్ నిర్మాతలు ఒక వైపు ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు పెంచాలి అంటూ విజ్ఞప్తి చేస్తుంటే.. మరో వైపు ఏపీ అధికార పార్టీ నాయకులు మాత్రం సినిమా పరిశ్రమ పై విరుచుకు పడుతున్నారు. హైదరాబాద్లో ఉంటున్న తెలుగు సినిమా ప్రముఖులకు ఏపీ అనే ఒక రాష్ట్రం ఉందని… వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అని తెలియదని అంటున్నారు. వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి చూపించడం కోసమే మేము ఈ పని చేస్తున్నట్లుగా కొందరు అనధికారికంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం అన్నట్లుగా ఉన్నాయి. తెలుగు సినిమాకు చెందిన నిర్మాతలు బలిసి కొట్టుకుంటున్నారు. వారు కనీసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ని గుర్తించడం లేదు…
వారికి తగిన శాస్తి జరగాల్సిందే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. బలిసి కొట్టుకుంటున్న వారు భారీ చిత్రాలు తీస్తున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు పలువురు నిర్మాతలు స్పందించారు. అయితే ఇప్పటి వరకు స్పందించిన నిర్మాతల్లో పెద్ద నిర్మాతలు లేకపోవడం విశేషం. చిన్న నిర్మాతలు చాలా మంది అలాంటి వ్యాఖ్యలు తగదు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.పెద్ద ఎత్తున ఎమ్మెల్యే వ్యాఖ్యల విషయమై దుమారం రేపుతున్న నేపథ్యంలో టాలీవుడ్ లోని ఆ నలుగురు ఐదుగురు పెద్ద నిర్మాతలు ఎందుకు స్పందించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి బలిసి కొట్టుకుంటున్న వాళ్లు మాత్రం ఇప్పటి వరకు స్పందించడం లేదు.
Tollywood producers comments on mla prasanna kumar reddy
ఎవరి గురించి అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశాడో ఆ నిర్మాతలు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా ఖండించాల్సిన అవసరం ఉంది.ఇలాంటి వ్యాఖ్యలను ముందుముందు చిన్న పెద్ద నాయకులు మరిన్ని చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విషయంలో వెంటనే ఆ పెద్ద నిర్మాతలు స్పందించాల్సిందిగా మీడియా వర్గాల వారు కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వైకాపా ప్రభుత్వం సినిమా పరిశ్రమ కు వ్యతిరేకంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు మరియు సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందో అనే భయంతో ఎవరూ మాట్లాడటం లేదు అనేది టాక్ వినిపిస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.