Nagarjuna : టాలీవుడ్‌లో అటు హీరోగా ఇటు నిర్మాతగానూ ఎక్కువగా ప్రయోగాలు చేసే హీరో ఒక్క నాగార్జుననే అని అందరూ చెప్పుకుంటుంటారు. అది ముమ్మాటికీ నిజం. కొత్త తరాన్ని ఎంకరేజ్ చేసి అవకాశాలు కల్పించాలన్నా..ధైర్యం చేసి సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాలన్నా..పాత్రల పరంగా కొత్త ప్రయోగాలు చేయాలన్నా..జోనర్ మార్చి సినిమాలు చేయాలన్నా అక్కినేని నాగార్జున తర్వాతే. అందుకే,
నాగార్జునను అందరూ కింగ్ అనేది. మన్మధుడు అని ఆ పేరుతో సినిమా వచ్చినప్పటి నుంచి పిలుచుకుంటున్నారు. 60 ఏళ్ళలో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్నారు నాగార్జున.
ఇటీవల బంగారాజు సినిమాతో వచ్చి హిట్ అందుకున్నారు. ఈ సినిమాపై ఎవరీ అంతగా అంచనాలు లేవు. పైగా సంక్రాంతి రేసు నుంచి కరోనా దెబ్బకి పెద్ద సినిమాలన్ని తప్పుకున్నాయి. ఈ అవకాశం కోసం ఎదురుచూసిన నాగార్జున ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా పెద్ద రిస్క్ అని తెలిసి కూడా
బంగార్రాజు సినిమాను వదిలారు. అనూహ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి నాగార్జునకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ప్రభాస్, రాజమౌళి, చిరంజీవి లాంటి వారు తమ సినిమాలను విడుదల చేయకుండా పోస్ట్ పోన్ చేస్తే నాగ్ ఒక్కటే హిట్ కొట్టి చూపించాడు. దాంతో
అందరూ నాగార్జునను పొగడ్తలతో ముంచేశారు.
ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా ది ఘోస్ట్. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ సునీల్ నారంగ్ , నారణ్ దాస్ కె నారంగ్ నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే, తాజాగా ఈ మూవీ పోస్టర్
రిలీజ్ చేసి త్వరలో యాక్షన్ టీజర్ వదలనున్నామని తెలిపారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత నాగార్జున తప్ప ఇలాంటి ప్రయఓగాలు మరో హీరో చేయరని చెప్పుకుంటున్నారు. బిజినెస్ పరంగా మాత్రమే కాకుండా సినిమాల ఎంపికలోనూ నాగ్ ఎప్పటికప్పుడు పెద్ద రిస్కే చేస్తున్నారని అంటున్నారు. వాస్తవంగా ఇలాంటి సినిమాలను హాలీవుడ్‌లో అటెంప్ట్ చేస్తుంటారు. కానీ, మన దగ్గర నాగ్ ట్రై చేసి సక్సెస్ అవుతున్నారు.
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
This website uses cookies.