Home » Entertainment » Nagarjuna Searching For Daughter In Law
Entertainment

Nagarjuna : కొత్త కోడ‌లు కోసం నాగార్జున వెతుకులాట‌.. పెళ్లి తేది కూడా ఫిక్స్ చేశాడా.!

Authored By
Sam C
The Telugu News | Published on: February 11, 2022, 9:30 pm
Advertisement

Nagarjuna : అక్కినేని ఫ్యామిలీకి ఏఎన్ఆర్ పెద్ద పునాది వేసిన విష‌యం తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుంచి నాగార్జున, సుమంత్‌, సుశాంత్‌, సుప్రియ, నాగచైతన్య, అఖిల్‌ సినిమా రంగంలో ఉన్నారు. ఇప్పుడు కూడా రాణిస్తున్నారు. మరో వైపు అన్నపూర్ణ స్టూడియోల ద్వారా సినిమా షూటింగ్‌లు, టీవీ షోస్‌, ఈవెంట్లు, సినిమా ఓపెనింగ్‌లకు కేరాఫ్‌గా మార్చారు.అయితే అక్కినేని ఫ్యామిలీని విడాకులు బ్రేకప్‌`లు ఇబ్బంది పెడుతున్నాయి. నాగార్జున మొదలు కొని ఇప్పుడు నాగచైతన్య వరకు విడాకుల అంశాలు అక్కినేని ఫ్యామిలీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.ఎంతో అన్యోన్యంగా ఉండే స‌మంత‌, నాగ చైత‌న్య విడిపోవ‌డం అంద‌రికి షాకింగ్‌గా మారింది.

Advertisement

స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత చైతూ చాలా డిప్రెష‌న్‌కి లోన‌వుతున్నాడ‌ని స‌మాచారం. అందుకే త్వ‌ర‌లో అత‌నికి త‌గ్గ అమ్మాయితో పెళ్లి జ‌రిపించాల‌ని అనుకుంటున్నారట‌. ఇప్ప‌టికే త‌మ‌కు తెలిసిన వారిలో ఓ అమ్మాయిని చూసార‌ని, ఆమెతో ఈ ఏడాది చివ‌రలో పెళ్లి కూడా జ‌రిపించ‌నున్నార‌ని సోష‌ల్ మీడ‌యాలో తెగ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాలంటే అక్కినేని కౌంపౌండ్‌కి సంబంధించి ఎవ‌రో ఒక‌రు స్పందించాల్సిందే. ఇక స‌మంత జాలీగా గ‌డుపుతుంది. సినిమాలు ,విహార‌యాత్ర‌ల‌తో ఫుల్ బిజీ అయింది.అక్కినేని కోడ‌లిగా ఉన్న స‌మంత త‌న సోషల్ మీడియా ఖాతాల్లోంచి అక్కినేని అనే పేరు తొలగించింది.

nagarjuna searching for daughter in law

Advertisement

Nagarjuna : గుడ్ న్యూస్ రానుందా…

కేవలం S అనే అక్షరంతో తన ప్రొఫైల్ నేమ్ అప్‌డేట్ చేసింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వ‌చ్చారు. అక్కినేని కుటుంబంతో సమంతకు విభేదాలు తలెత్తాయా? అనే కోణంలో కామెంట్స్ చేశారు. మరోవైపు ఈ ఇష్యూపై పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ 2న తాము విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు చైతూ- స‌మంత‌.చివ‌రిగా నాగార్జున‌, నాగ చైత‌న్య కలిసి బంగార్రాజు సినిమా చేయ‌గా, ఈ సినిమా మంచి వసూళ్లు రాబ‌ట్టింది. సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురిపించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి