Home » Entertainment » Namitha About Her Over Weight
Entertainment

Namitha : మద్యం తాగడం వల్లే బరువు… నమిత కామెంట్స్ వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 3, 2021, 8:59 pm
Advertisement

Namitha ఒకప్పటి హీరోయిన్ నమిత ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. జీరో సైజ్‌లో ఉండే నమిత ఇప్పుడు భారీ కాయంలో బొద్దుగా మారిపోయింది. అలా బొద్దుగా ఉన్న నమిత సినిమాల్లో అంతగా నటించలేదు. ఎక్కువగా ఆఫర్లు రాలేదు కూడా. అయితే తాజాగా నమిత తన సైజ్‌ను తగ్గించుకుని శరీరాకృతిని మార్చుకుని.. జీరో సైజ్‌లోకి మారేందుకు బాగా కష్టపడుతోంది. తాజాగా నమిత మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న కష్టాలు చెప్పుకొచ్చింది.

Advertisement

Namitha about her over weight

మానసిక ఒత్తిడిని ఎదుర్కొవడంపై అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పోస్ట్ పెడుతున్నాను. సుమారు తొమ్మిది, పదేళ్ల క్రితం నేను బొద్దుగా ఉండేదాన్ని. అప్పట్లో ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యాను. ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నాననే విషయం కూడా నాకు తెలియకపోవడం మరింత బాధాకరం. రాత్రిపూట నిద్రపోయేదాన్ని కాదు. ఆహారం ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మారింది. అనుకోకుండా విపరీతంగా బరువు పెరిగిపోయాను.

Advertisement

మద్యం తాగడం వల్లే బరువు..: Namitha

అలా నా బరువు 97 కిలోలకు చేరింది. మద్యం తాగడం వల్లే నేను బరువు పెరిగానని అందరూ చెప్పుకున్నారు. థైరాయిడ్‌, పీసీఓడీ సమస్యల వల్లే లావుగా మారాననే విషయం నాకు మాత్రమే తెలుసు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు నన్ను మరెంతో బాధించాయి. దాదాపు ఐదేళ్లపాటు తీవ్రమైన కుంగుబాటు ఎదుర్కొన్న తర్వాత యోగాతో మనశ్శాంతి లభించింది. నాకు కావాల్సిన శాంతి మంత్రాన్ని నాలోనే కనుగొన్నాను. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మీరు దేని కోసమైతే బయట ప్రపంచంలో వెతుకుతున్నారో అది మీలోనే ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని నమిత చెప్పుకొచ్చింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి