SuperStar Krishna : కృష్ణ అంటే మహేష్ బాబు కంటే నమ్రతాకే ఎక్కువ ఇష్టం.. కోడలు పిల్ల ఏం చేసిందో చూడండి..!!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 17, 2022, 3:40 pm

SuperStar Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇక మనకు లేరు. ఆయన చనిపోయి 3 రోజులు అవుతోంది. ఆయన ఈ ప్రపంచంలో ఇక లేరు అనే విషయాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన కుటుంబ సభ్యుల బాధ అయితే వర్ణణాతీతం. ముఖ్యంగా మహేశ్ బాబును అయితే ఎవ్వరూ ఓదార్చలేకపోతున్నారు. సినీ ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా కృష్ణ మృతితో మూగబోయింది. సినీ ఇండస్ట్రీ గొప్ప లెజండ్ ను కోల్పోయిందని అందరూ బాధపడుతున్నారు. ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కులా ఉన్న కృష్ణ ఈ లోకాన్ని వీడిపోవడంతో అందరూ బాధపడుతున్నారు.

నిన్న సాయంత్రం ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తన కొడుకు మహేశ్ బాబు కృష్ణకు తలకొరివి పెట్టారు. అయితే.. కృష్ణ మీద తన కొడుకు మహేష్ బాబు కంటే కూడా ఆయన భార్య నమ్రతకే ఎక్కువ ఇష్టం అట. ఆమె కృష్ణను కంటికి రెప్పలా చూసుకునే వారట. తన మామ గారిని నమ్రత చాలా బాగా చూసుకునేవారట. ఆయనంటే ఆమెకు అంత గౌరవం అట. ఆయన మంచంలో పడినప్పటి నుంచి.. ఆయన అనారోగ్యంతో ఉన్నన్ని రోజులు దగ్గరుండి అన్ని సేవలు చేసింది నమ్రత.

namratha takes care of krishna more than mahesh babu

namratha takes care of krishna more than mahesh babu

SuperStar Krishna : కృష్ణ పేరుతో హాస్పిటల్ ప్లాన్ చేస్తున్న నమ్రత

సూపర్ స్టార్ కృష్ణ చాలా ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు కొందరు డాక్టర్ల బృందం ట్రీట్ మెంట్ చేస్తోంది. అయితే.. ఆయనకు ఇన్నాళ్లు వైద్యం చేసిన డాక్టర్లతో కలిసి నమ్రత కృష్ణ పేరు మీద ఆయన జ్ఞాపకార్థం ఓ ఆసుపత్రిని నిర్మించాలని అనుకుంటోందట. మరి.. అది ఉచితంగా అందరికీ వైద్యం అందిస్తారా? లేక ఎలాంటి ఆసుపత్రిని నిర్మిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp