BalaKrishna : బాలకృష్ణ కాస్త దూకుడు తగ్గించాలయ్యా!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 May 2022,2:00 pm

BalaKrishna : నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో దాదాపుగా రెండు వందల కోట్ల వసూళ్లను అఖండ వసూళ్లు చేసిందని.. అత్యధిక థియేటర్లలో అఖండ సినిమా 50 రోజులను పూర్తి చేసుకుందని వార్తలు వచ్చాయి. అఖండ సాధించిన విజయం తో బాలయ్య ఫుల్‌ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా మాస్ లుక్‌ బాలయ్యకు మరో విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయం అన్నట్లుగా ఉన్నాయి.

అఖండ సినిమా తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమాల జాబిత చాలానే ఉన్నాయి. గోపీచంద్‌ మలినేని సినిమా ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం కాగా ఆ తర్వాత అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు బాలయ్య బాబు ఓకే చెప్పాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను ఇదే ఏడాదిలో పట్టాలెక్కించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమాను ఇదే ఏడాది విడుదల చేయబోతున్నారు. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

nandamuri BalaKrishna back to back movie not right fans says

nandamuri BalaKrishna back to back movie not right fans says

ఈ రెండు సినిమాలు కాకుండా బాలయ్య మరో రెండు సినిమాలకు కూడా కమిట్‌ అవ్వడం నందమూరి అభిమానుల్లో చర్చనీయాంశం అయ్యింది. అఖండకు ముందు బాలయ్య వరుస ఫ్లాప్ లతో సతమతం అయ్యాడు. కనుక బాలయ్య ఇప్పుడు అఖండ సినిమా జోరు ను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఫలితారు తారు మారు అయ్యే అవకాశం ఉంది. తొందరపడి సినిమాలను చేయడం కంటే మెల్ల గా చేయడం మంచిదని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి