Home » Entertainment » Nandamuri Taraka Ratna Wife Alekhya Reddy Emotional Post
Entertainment

Taraka Ratna Wife : కన్నీళ్లు పెట్టిస్తున్న తారకరత్న భార్య పోస్ట్..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 24, 2023, 9:00 am
Advertisement

Taraka Ratna Wife : ఇటీవల నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 23 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఫిబ్రవరి 18న రాత్రి 9:40 కన్నుమూశారు. దీంతో తారకరత్న కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించారు. అభిమానులు కూడా తారకరత్న తలుచుకుని విచారం వ్యక్త చేశారు. ఇక తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పవచ్చు. తారకరత్న కుటుంబ అంగీకారం లేకుండా అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

Nandamuri Taraka Ratna Wife Alekhya Reddy Emotional Post

అయితే తాజాగా అలేఖ్య రెడ్డి తన భర్త జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పటికీ భర్త మరణం అలేఖ్య రెడ్డి జీర్ణించుకోలేకపోతోంది. ప్రేమించిన వ్యక్తి దూరం కావడం కుటుంబానికి అండగా ఉండాల్సిన మనిషి తమ మధ్యలో లేకపోవడంతో ఆయన జ్ఞాపకాలను పంచుకుంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో వారి కూతురు హ్యాపీ హ్యాపీ బర్తడే బెస్ట్ ఫాదర్, బెస్ట్ హస్బెండ్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ సో బ్యాడ్లి మిస్ యు నాన్న ఐ లవ్ యు సో మచ్ అనే కామెంట్ తో తన కూతురు ఎంత ఎమోషనల్ అయింది అనే విషయాన్ని పోస్టులో అలేఖ్య రెడ్డి రాసింది.

Advertisement

Nandamuri Taraka Ratna Wife Alekhya Reddy Emotional Post

అలాగే కూతురుతో కలిసి తారకరత్న దిగిన ఫోటోను అలేఖ్య రెడ్డి ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. తారకరత్న జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతున్నాయి అని ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇకపోతే తారకరత్న మరణంతో జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న మధ్య మంచి అనుబంధం ఉంది. తారకరత్న గతంలో ఓ ఇంటర్వ్యూలో తన తమ్ముడి పై ఉన్న అభిమానాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి