Ante Sundaraniki Movie First Day Collections : నాని సినిమా తొలి రోజు ఎంత వసూళ్లు రాబట్టిందంటే..!
Ante Sundaraniki Movie First Day Collections : నేచురల్ స్టార్ నాని, మలయాళ ముద్దు గుమ్మ నజ్రియ నజీం జంటగా నటించిన అంటే సుందరానికి చిత్రం జూన్ 10 థియేటర్లలోకి వచ్చింది. అయితే గత చిత్రాలతో పోల్చుకొంటే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం పడింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు ఫర్వాలేదనిపించాయి. నైజాంలోని పలు ప్రాంతాల్లో చెప్పుకోదగిన కలెక్షన్లను సాధించింది ఈ అంటే సుందరానికి మూవీ. తొలి రోజున అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రం నైజాంలో 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
రెండో రోజు కూడా ఈ సినిమాకు అంతంత మాత్రంగానే అడ్వాన్స్ బుకింగ్ వచ్చాయని తెలుస్తోంది. నైజాం, ఆంధ్రాలో కలిపి 4 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది ఈ మూవీ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమాకు తొలి రోజున 7.5 కోట్ల గ్రాస్ వసూలైందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి.నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. అమెరికాలో జురాసిక్ వరల్డ్ డొమినియన్, టాప్ గన్ సినిమాల రూపంలో, కర్ణాటకలో 777 చార్లీ సినిమా వల్ల, అలాగే తమిళనాడులో విక్రమ్ జోరు కారణంగా వసూళ్లపై ప్రభావం పడింది. చాలా చోట్ల థియేటర్లు లభించలేదని తెలిసింది.
Nani Ante Sundaraniki movie first day gets low collections
Ante Sundaraniki Movie First Day Collections : నాని అంతగా రాబట్టలేకపోయాడు..
అయినా ఇలాంటి బలమైన పరిస్థితులను తట్టుకొని యావరేజ్ కలెక్షన్లను రాబట్టింది.అంటే సుందరానికి చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్లపరంగా ఫర్వాలేదనిపించింది. అయితే నాని ఇతర సినిమా ఓపెనింగ్స్‌తో పోల్చుకొంటే నిరాశను కలిగించిందనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజున 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శ్యామ్ సింగరాయ్‌తో పోల్చుకొంటే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇక ప్రీమియర్ల వసూళ్లు అమెరికాలో 228 లొకేషన్ల నుంచి 212,653 డాలర్లు వసూలు చేసింది.