Home » Entertainment » Nanis Tuck Jagadeesh Inko Saari Inko Saari Lyrical Song Release
Entertainment

Nani : నాని టక్ జగదీష్ నుంచి ‘ఇంకోసారి ఇంకోసారి’ లిరికల్ సాంగ్ రిలీజ్..!

Authored By
vamana sai
The Telugu News | Published on: February 13, 2021, 9:46 am
Advertisement

Nani : నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగమ్మాయి రీతు వర్మ, ఐశ్వర రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ‘ఇంకోసారి ఇంకోసారి’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే ట్రెండ్ అవుతూ ఆకట్టుకుంటోంది.

Advertisement

nanis-tuck-jagadeesh-inko-saari-inko-saari-lyrical-song-release

ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా తాజాగా రిలీజైన ‘ఇంకోసారి ఇంకోసారి’ సాంగ్ కి థమన్ ఇచ్చిన సంగీతం మ్యూజిక్ లవర్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఇక శివ నిర్వాణ సినిమా అంటే ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ గా నిలుస్తుంది. కథ కి తగ్గట్టు సినిమాలో సాంగ్స్ ఉండేలా చూస్తాడు దర్శకుడు శివ నిర్వాణ. అంతేకాదు మంచి సాహిత్యం కూడా శివ నిర్వాణ తెరకెక్కించే సినిమాలలో ఉంటుంది. అలాగే ఈ సాంగ్ కూడా మంచి సాహిత్యం తో తయారు చేశారు.

Advertisement

Nani : నాని టక్ జగదీష్ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

కాగా నాని గత చిత్రం వి అనుకున్నంత సక్సస్ కాకపోవడంతో టక్ జగదీష్ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఇక గతంలో నాని – శివ నిర్వాణ కాంబినేషన్ లో నిన్నుకోరి సినిమా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత శివ నిర్వాణ నుంచి వచ్చిన మజిలీ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది. ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న శివ నిర్వాణ మూడవ సినిమాగా నాని తో టక్ జగదీష్ చేస్తుండంతో అందరిలో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 16 న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి