Nara Rohith : 40 ఏళ్ల వ‌య‌స్సులో ఆ హీరోయిన్‌తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న నారా రోహిత్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nara Rohith : 40 ఏళ్ల వ‌య‌స్సులో ఆ హీరోయిన్‌తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న నారా రోహిత్

Nara Rohith : టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు లేటు వ‌య‌స్సులో పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నారా రోహిత్ చేరాడు.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోదరుడు కుమారుడు నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బాణం’ అనే సినిమాతో ఇండస్ట్రీపై గురిపెట్టిన ఆయ‌న సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 October 2024,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Nara Rohith : 40 ఏళ్ల వ‌య‌స్సులో ఆ హీరోయిన్‌తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న నారా రోహిత్

Nara Rohith : టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు లేటు వ‌య‌స్సులో పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నారా రోహిత్ చేరాడు.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోదరుడు కుమారుడు నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బాణం’ అనే సినిమాతో ఇండస్ట్రీపై గురిపెట్టిన ఆయ‌న సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు అనే సినిమాల్లో నటించారు. ఇలా పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అల‌రించిన ఆయ‌న‌ 2018 తరువాత దాదాపు ఆరు సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నారు.

Nara Rohith పెళ్లి త‌రువాయి..

ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు రోహిత్. ఈ ఏడాది ‘ప్రతినిధి 2’ అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఇక నారా రోహిత్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. నారా వారి అబ్బాయి నారా రోహిత్ త్వరలో ఓ ఇంటి వాడు కానున్నట్లు ప్రచారం జరిగింది. నారా రోహిత్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి.. మ్యారేజ్ లైఫ్ లో అడుగు పెట్టబోతున్నారనే వార్తలు వ‌చ్చాయి. క‌ట్ చేస్తే ఆదివారం ఈ జంట నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫంక్షన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతోపాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులంతా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Nara Rohith 40 ఏళ్ల వ‌య‌స్సులో ఆ హీరోయిన్‌తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న నారా రోహిత్

Nara Rohith : 40 ఏళ్ల వ‌య‌స్సులో ఆ హీరోయిన్‌తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న నారా రోహిత్

ఇరువురి కుటుంబ పెద్దలు డిసెంబర్‌ 15న వీళ్లిద్దరి పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించారు. కాగా.. ప్రతినిధి-2 సినిమాలో నారా రోహిత్‌తో కలిసి నటించింది శిరీష. ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్‌ లైఫ్‌లోనూ పార్ట్‌నర్స్ అవుతున్నారు.. బాణంలా సినిమా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చి ప్రతి మూవీ సెలక్షన్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రోహిత్‌.. పెళ్లి విషయంలోనూ బాగా టైమ్ తీసుకున్నారు. ఫైనల్‌గా సోలో లైఫ్‌కి గుడ్‌బై చెప్పి తన మనసుకు నచ్చిన ప్రతినిధిగా శిరీష చెయ్యి పట్టుకుని ఏడడుగులు వెయ్యబోతున్నారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది