
Navya Swamy Funny Quotes to Ravi Krishna
Navya Swamy : నవ్యస్వామి, రవికృష్ణల మ్యాటర్ ఏంటన్నది ఎవ్వరికీ అర్థం కాదు. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతోన్నారంటూ రకరకాల కథనాలు వస్తుంటాయి. అయితే వీరిద్దరూ మాత్రం వాటిని ఖండిస్తుంటారు. తామిద్దరం మంచి స్నేహితులమేనని అంటుంటారు. కానీ సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం అలా ఉండవు. నవ్యస్వామి పోస్టులకు రవికృష్ణ ఇచ్చే రిప్లైలు వెరైటీగా ఉంటాయి. నవ్యస్వామి ఏ పోస్ట్ పెట్టినా మొదట రవికృష్ణ స్పందిస్తుంటాడు. మూడు లవ్ సింబల్స్‌ను పెడుతుంటాడు. ఆమె కథ సీరియల్‌తో వీరి ప్రయాణం మొదలైంది. అలా ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ మీద పండించిన కెమిస్ట్రీకి జనాలు ఫిదా అయ్యారు. ఇక ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ బాగానే కలిసి ఉండేవారు.
తెలుగు సినీ పరిశ్రమలో కరోనా మొదటిసారిగా వచ్చింది కూడా ఈ ఇద్దరికే. ఆమె కథ సీరియల్ షూటింగ్‌లో ఈ ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. అప్పుడు అందరూ అన్న మాటలకు, చూసిన చూపులకు ఎంత వేదన, నరకం అనుభవించారో స్టేజ్ మీద చెబుతూ నవ్యస్వామి ఎంతో ఎమోషనల్ అయింది. ఇక రవికృష్ణ అయితే తన ఇంట్లోకాకుండా శివజ్యోతి ఇంట్లో ఉన్న సంగతి తెలిసిందే. నవ్యస్వామి రవికృష్ణలు ఏదైనా ఎంటర్టైన్మెంట్ షోకు వస్తే మరింతగా రెచ్చిపోతారు. అప్పట్లో ఓ సారి సుమ క్యాష్ షోలో వచ్చారు. ఎత్తుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి ప్రేమ, పెళ్లి రూమర్లు ఊపందుకున్నాయి.
Navya Swamy Funny Quotes to Ravi Krishna
ఓ సారి సుమ కూడా నవ్యస్వామిని స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేసింది. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు అని నవ్యస్వామితో సుమ ముచ్చట్లు పెట్టింది. అందులోనూ పెళ్లి, ప్రేమ గురించి అడిగింది. కానీ తామిద్దరం మంచి స్నేహితులమేనని నవ్యస్వామి క్లారిటీ ఇచ్చింది. తాజాగా నవ్యస్వామి ఓ పోస్ట్ వేసింది. కారులో మనకు నచ్చిన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు.. పాటలు పాడుకుంటూ ఉన్నామంటే.. మనం ఎంతో సంతోషంగా ఉన్నట్టు లెక్క అనేట్టుగా ఓ కొటేషన్ కనిపించింది. దాన్ని నవ్యస్వామి షేర్ చేస్తూ రవికృష్ణకు ట్యాగ్ చేసింది. ఇక రవికృష్ణ రిప్లై ఇస్తూ అవును అన్నట్టుగా.. చెప్పుకొచ్చాడు. అంటే ఈ ఇద్దరూ లాంగ్ డ్రైవ్‌లకు అలా వెళ్తుంటారన్నమాట.
Navya Swamy Funny Quotes to Ravi Krishna
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.