Navya Swamy : కన్నడ సుందరి అందమంటే ఇది.. నవ్వుతో కట్టిపడేస్తోన్న నవ్యస్వామి
Navya Swamy నవ్యస్వామి Navya Swamy కన్నడ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీలో మోడలింగ్, బుల్లితెర అంటూ అక్కడ బాగానే ఫేమస్ అయింది. కానీ గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగు బుల్లితెర ద్వారానే. తెలుగులో ఆహ్వానం అనే సీరియల్ ద్వారా ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది. మురళీ మోహన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సీరియల్ ద్వారా నవ్యస్వామికి గుర్తింపు వచ్చింది. ఆతరువాత వరుసగా సీరియల్ ఆఫర్లు వచ్చాయి. అలా ఇప్పుడు నవ్యస్వామి బుల్లితెరపై స్టార్‌గా దూసుకుపోతోంది.
Navya Swamy Latest Half Saree Pics Goes Viral
కన్నడ సుందరి అందమంటే ఇది.. నవ్వుతో కట్టిపడేస్తోన్న నవ్యస్వామి Navya Swamy
నా పేరు మీనాక్షి సీరియల్‌తో బాగానే క్రేజ్ సంపాదించుకుంది నవ్యస్వామి. ఇక ఇప్పుడు ఆమె కథ సీరియల్ అంటూ రవికృష్ణతో దుమ్ములేపుతోంది. బుల్లితెరపై ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి జనాలు రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు. రవికృష్ణ నవ్యస్వామి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే టాక్ వచ్చింది.
Navya Swamy Latest Half Saree Pics Goes Viral
కానీ తామిద్దరం స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అయినా రూమర్లు మాత్రం ఆగడం లేదు. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే నవ్యస్వామికి ప్రేమ, పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురువుతూనే ఉంటాయి.సోషల్ మీడియాలో నవ్యస్వామి చేసే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. రవికృష్ణ, హరితేజ, శివజ్యోతిలాంటి వారితో కలిసి పార్టీలంటూ రచ్చ చేస్తుంది.
Navya Swamy Latest Half Saree Pics Goes Viral
ఇక ఆమె షేర్ చేసే ఫోటోలు, ఫోటో షూట్లు అయితే అందరినీ కట్టిపడేస్తుంటాయి. మోడ్రన్ దుస్తులైన, చీరలోనైనా, లంగావోణిలోనైనా కూడా నవ్యస్వామి మాత్రం తన నవ్వుతోనే కట్టిపడేస్తుంటుంది. నిన్న జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీ కోసం నవ్యస్వామి స్పెషల్‌గా రెడీ అయింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
