Navya Swamy Special Birthday WIshes To Ravi Krishna
Navya Swamy ; బుల్లితెరపై లవ్ ట్రాకులు నడిపించడం అంత ఈజీ ఏమీ కాదు. వారిద్దరి కెమిస్ట్రీని జనాలు మెచ్చాలి. అది నిజమా? అనేట్టు భ్రమ కల్పించాలి. అలాంటప్పుడే అవి క్లిక్ అవుతాయి. వాటి గురించి చర్చలు జరుగుతుంటాయి. అలా ఎంతో మంది ఇప్పటి వరకు ట్రాకులు నడిపించి ఫేమస్ అయ్యారు. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తే వారికింకా తిరుగుండదు. అలా నవ్యస్వామి, రవికృష్ణలు అయితే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా రవికృష్ణ మీద నవ్యస్వామి ఓ పోస్ట్ వేసింది. నవ్యస్వామి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఎప్పుడు ఏ పోస్ట్ వేసినా కూడా రవికృష్ణ వెంటనే స్పందిస్తుంటాడు.
ఇక ఆమె షేర్ చేసే ఫోటో షూట్లకు అయితే కచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఓ మూడు లవ్ సింబల్స్‌ను కామెంట్లుగా పెడతాడు. అంటే దానర్థం ఏంటో ఎవ్వరికీ చెప్పడు. అది ప్రేమా? స్నేహమా? అన్న క్లారిటీ ఇవ్వడు. మళ్లీ ఆన్ స్క్రీన్‌కు వస్తే.. రొమాన్స్‌తో రెచ్చిపోతోంటారు. ఇప్పటికే ఢీ షోలో ఈ ఇద్దరూ కలిసి చేస్తున్నారు. ఇక ఇతర ఈవెంట్లు, షోలకు వెళ్లినప్పుడు మరింత సందడి చేస్తుంటారు. ‘పొడవైన, ఎంతో ఫిట్ అయిన, అత్యంత సన్నిహితుడైనా నా ఫ్రెండ్ రవికృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్ కోరుకునే ప్రతీ ఒక్కటీ నీ జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా నువ్ వాటి గురించి కష్టపడతావని కూడా నాకు తెలుసు..
Navya Swamy Special Birthday WIshes To Ravi Krishna
ఎందుకంటే నువ్ ఎంతో సహనంతో ఉంటావో.. ఎంత అంకితబావంతో పని చేస్తావో.. ఎంత కమిటెడ్‌గా ఉంటావో నాకు తెలుసు. అవన్నీ ఉన్నాయ్ కాబట్టి కచ్చితంగా నువ్ ఎంతో ఎత్తుకు ఎదుగుతావ్.. సంతోషంగా ఉంటావ్.. ఈ ఏడాది అంతా కూడా నీకు మంచే జరగాలని కోరుకుంటున్నాను’ అని నవ్యస్వామి విషెస్ చెప్పింది. దానికి రవికృష్ణ. థ్యాంక్యూ సో మచ్ మా అని రిప్లై ఇచ్చాడు. మొత్తానికి రవికృష్ణ నవ్యస్వామి టాపిక్ మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. రవికృష్ణ బర్త్ డే అంటూ నవ్యస్వామి చేసిన ఈ పోస్ట్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. నెటిజన్లు అయితే ఈ ఇద్దరి జోడికి ఫిదా అవుతున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.