Nayanthara : ఏడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన నయనతార- విగ్నేష్ శివన్ జంట వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లైన మరుసటి రోజే చేదు అనుభవం ఎదురైంది. అలా పెళ్లైందో లేదో ఇలా ఊహించని రీతిలో సమస్య వచ్చి పడింది. అది కూడా పవిత్ర దేవస్థానం తిరుమల రూపంలో. దీంతో ఈ ఇష్యూని పెద్దది చేయడం ఎందుకని భావించి క్షమాపణలు కోరారు నయన్ భర్త విగ్నేష్ శివన్. కాళ్లకు చెప్పులు ధరించి తిరుమల మాడ వీధుల్లో నడవడం పట్ల తమిళ నటుడు విఘ్నేశ్ శివన్ క్షమాపణలు చెప్పారు. టీటీడీకి ఆయన తాజాగా ఒక లేఖ రాస్తూ.. తమ కాళ్లకు చెప్పులు ఉన్నాయన్న విషయాన్ని గమనించలేదన్నారు. శ్రీవారిపై ఎంతో నమ్మకం, భక్తి ఉన్నాయని చెబుతూ..
తెలియక చేసిన తప్పును మన్నించాలని వేడుకున్నారు. ‘‘తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలన్నది మా కోరిక. అందుకే గత నెల రోజుల్లో తిరుమలకు ఐదు సార్లు వచ్చి వెళ్లాం. కానీ, అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పెళ్లి అయిన వెంటనే నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణ సేవలో పాల్గొనాలన్నది మా ఆలోచన. అదే ఆలోచనతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాం. దర్శనం తర్వాత ఆలయం ముందు ఫొటోలు తీసుకున్నది.. మా పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలనే. ఈ హడావిడిలో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు ఎంతో నమ్మకం ఉంది.
దయచేసి మమ్మల్ని క్షమించండి’’ అంటూ విఘ్నేశ్ శివన్ లేఖలో కోరారు. వివాహానంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన కొత్త దంపతులు నయతార-విఘ్నేశ్ శివన్‌లు వివాదంలో చిక్కుకున్నారు. దర్శనాంతరం ఈ జంట తిరుమల కొండపై శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో తిరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విఘ్నేశ్ చెప్పులు విడిచి నడిచినా.. నయనతార మాత్రం చెప్పులతోనే మాడ వీధుల్లో తిరిగింది. అంతేకాకుండా శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారానికి అత్యంత సమీపంలోనే వారు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో, ఇది వివాదాస్పదం అయింది..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.