Nayanthara in police case
Nayanthara : సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది నయనతార. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దానికి పైగా అవుతున్న ఇప్పటికీ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇకపోతే నయనతార తమిళ్ డైరెక్ట్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలని కూడా కన్నారు. ఫ్యామిలీ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో సినిమాల పరంగా కూడా అంతే సక్సెస్ గా ముందుకెళుతున్నారు. ప్రస్తుతం నయన్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తమిళ్ డైరెక్టర్ అట్లీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
అయితే తాజాగా సోషల్ మీడియాలో నయనతార మీద ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆస్తి తగాదా కేస్ లో నయనతార ఫ్యామిలీ మీద పోలీస్ కేసు ఫైల్ అయినట్లు తెలుస్తోంది. విగ్నేష్ శివన్ తండ్రి పేరు శివ. ఆయనకు మొత్తం తొమ్మిది మంది సోదరులు ఉన్నారు. కొంతకాలం క్రింద విగ్నేష్ శివన్ తండ్రి కాలం చేశారు. అయితే ఆయన బ్రతికి ఉన్నప్పుడు సోదరులకు చెందిన ఆస్తిని ఎవరికి చెప్పకుండా అమ్మేశారట. ఉమ్మడి ఆస్తుల్ని ఎవరికి చెప్పకుండా విఘ్నేశ్ తండ్రి అమ్మేసి, ఆ డబ్బుల్ని తమ సొంతానికి వాడుకున్నట్లుగా పేర్కొంటూ తిరుచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు.
Nayanthara in police case
విగ్నేష్ శివన్ బాబాయ్ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కేసు రాసుకున్నారు. దర్శకుడు విగ్నేష్ శివన్ తో పాటు ఆయన భార్య నయనతార, తల్లి మీనా కుమారి, సోదరి ఐశ్వర్య పైనా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. మరి నయనతార తన భర్త ఆస్తి తగాదాల విషయంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇకపోతే నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతుంది. ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే ఆమె కెరియర్ కు ఎటువంటి ఢోకా ఉండదు. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.