Nayanthara And vignesh shivan facing problems after marriage
Nayanthara : ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న నయనతార ఎట్టకేలకు తన ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కింది. దాదాపు ఏడేళ్ల సహజీవనానికి తెరదించుతూ వీరిద్దరూ అధికారికంగా భార్య భర్తలు అయ్యారు. నయనతార సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ గా కీర్తి పొందింది. అయితే వీరి పెళ్లికి ప్రముఖ సినీ రాజకీయ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది.తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, వంటి తదితరులు ఈ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా నయనతార వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది.
ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఓ హోటల్‌లో ఈ ప్రేమ పక్షులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాది సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న వీరి వివాహ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, ప్రముఖ నిర్మాత బోణీ కపూర్, దర్శకుడు అట్లీ, రాధికా శరత్ కుమార్, విజయ్ సేతుపతి, కార్తి, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే విఘ్నేష్ శివన్ ఈ రోజు పెళ్లికి ముందు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
nayanthara looks cute in bride
‘ఈ రోజు జూన్ 9.. ఇది నయన్ లవ్.థ్యాంక్యూ గాడ్… నా జీవితంలోని అందమైన వ్యక్తులు, విశ్వం, సంకల్పానికి ధన్యవాదాలు !! ప్రతి మంచి ఆత్మ, ప్రతి మంచి క్షణం, ప్రతి మంచి యాదృచ్చికం, ప్రతి ఆశీర్వాదం, ప్రతిరోజూ షూటింగ్, ప్రార్థనలు నా జీవితాన్ని ఇంత అందంగా మార్చాయి. వీటిన్నింటికి నేను కృతజ్ఞతుడిని. ఇప్పుడు, ఇదంత నా జీవితంలోని ప్రేమకు(నయనతార) అంకితం. మరి కొద్ది గంటల్లో వధువుగా నిన్ను చూసేందుకు పరితపిస్తున్న తంగమై. మన కుటుంబం, స్నేహితుల ఆశీర్వాదంతో అధికారికంగా నీతో కొత్త జీవితం ఆరంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు విఘ్నేశ్.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.