nayanthara shock to the god father team
Godfather : లేడి సూపర్ స్టార్ నయనతార ( nayanthara ) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అందంతో పాటు అభినయంతో ఇంట బయటా కూడా ఎక్కువ మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది నయన్. పెళ్లి తర్వాత మళ్లీ గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్న నయనతారను చూసి ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మలయాళ చిత్రం లూసీఫర్ రీమేక్‌గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదవుతున్నాయి. అక్టోబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు సాగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషలలో జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి తమిళంలో జరుగుతున్న ప్రమోషనల్ కార్యక్రమాలకి నయనతార హాజరు కాకపోవడం పెద్ద దెబ్బగా మారిందని అంటున్నారు. గతంలో ఏ మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ల లో కనిపించిన నయన్ ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా కనిపించడం లేదు.
nayanthara shock to the god father team
ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న నయనతార మళ్ళీ సినిమాలతో బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం నయనతార చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక తమిళ్లో మాత్రమే కాక తెలుగులో కూడా నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “గాడ్ ఫాదర్” సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించి సందడి చేయనుంది.’సైరా’లో చిరంజీవి సతీమణిగా నటించిన నయనతార.. ‘గాడ్ ఫాదర్’లో ఆయనకు చెల్లెలుగా నటిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నయన్ సిస్టర్ పాత్రలలో కనిపిస్తున్నారు. నయన్ తన పెళ్లి తర్వాత నటించిన సినిమాల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. ఈ సినిమాలో ‘సత్యప్రియ జయదేవ్’ పాత్రలో నయన్ నటిస్తున్నారు. ఎంతో సింపుల్‌గా నయన్ లుక్ ఉంది. చిరంజీవికి చెల్లెలుగా నయనతార క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా కనిపించనుంది
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.