Godfather : తెల్లారితే గాడ్ ఫాదర్ రిలీజ్ :: చిరంజీవి కి జన్మలో మర్చిపోలేని దెబ్బ కొట్టిన నయనతార | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Godfather : తెల్లారితే గాడ్ ఫాదర్ రిలీజ్ :: చిరంజీవి కి జన్మలో మర్చిపోలేని దెబ్బ కొట్టిన నయనతార

 Authored By sandeep | The Telugu News | Updated on :4 October 2022,6:30 pm

Godfather : లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ( nayanthara ) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అందంతో పాటు అభిన‌యంతో ఇంట బ‌య‌టా కూడా ఎక్కువ మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది న‌య‌న్. పెళ్లి తర్వాత మళ్లీ గాడ్ ఫాద‌ర్ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్న నయనతారను చూసి ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మలయాళ చిత్రం లూసీఫర్ రీమేక్‌గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదవుతున్నాయి. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి త‌మిళంలో జ‌రుగుతున్న ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌కి న‌య‌న‌తార హాజ‌రు కాక‌పోవ‌డం పెద్ద దెబ్బ‌గా మారింద‌ని అంటున్నారు. గ‌తంలో ఏ మూవీ ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌ల లో క‌నిపించిన న‌య‌న్ ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో కూడా క‌నిపించ‌డం లేదు.

nayanthara shock to the god father team

nayanthara shock to the god father team

Godfather : భ‌లే హ్యాండ్ ఇచ్చిందిగా..

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న నయనతార మళ్ళీ సినిమాలతో బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం నయనతార చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక తమిళ్లో మాత్రమే కాక తెలుగులో కూడా నయనతార మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “గాడ్ ఫాదర్” సినిమాలో ముఖ్యపాత్రలో క‌నిపించి సంద‌డి చేయ‌నుంది.’సైరా’లో చిరంజీవి సతీమణిగా న‌టించిన న‌య‌న‌తార‌.. ‘గాడ్ ఫాద‌ర్‌’లో ఆయనకు చెల్లెలుగా న‌టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సీనియ‌ర్ స్టార్ హీరోల సినిమాల్లో నయన్ సిస్టర్ పాత్రలలో కనిపిస్తున్నారు. న‌య‌న్ తన పెళ్లి త‌ర్వాత న‌టించిన సినిమాల్లో ‘గాడ్ ఫాద‌ర్’ ఒక‌టి. ఈ సినిమాలో ‘స‌త్య‌ప్రియ జ‌య‌దేవ్’ పాత్ర‌లో న‌య‌న్ న‌టిస్తున్నారు. ఎంతో సింపుల్‌గా న‌య‌న్ లుక్ ఉంది. చిరంజీవికి చెల్లెలుగా న‌య‌నతార క్యారెక్ట‌ర్ ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించ‌నుంది

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది