Unstoppable : అదరగొడుతున్న పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్.. పవర్ టీజర్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :20 January 2023,9:00 pm

Unstoppable : బాలకృష్ణ “అన్ స్టాపబుల్” టాకీ షో దేశంలోనే నెంబర్ వన్ టాకీ షోగా రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ చాలా హైలెట్ గా నిలిచింది. గత ఏడాది ప్రారంభమైన “అన్ స్టాపబుల్” టాకీ షోలో… మొదటి సీజన్ మొత్తం సినిమా సెలబ్రిటీలు వచ్చారు. తర్వాత సెకండ్ సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సెకండ్ సీజన్ లో ఇప్పటికే చాలామంది పొలిటికల్ నేతలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి పెద్దపెద్ద నాయకులు వచ్చారు.

సినిమా సెలబ్రిటీల పరంగా చూసుకుంటే ప్రభాస్ రావటం జరిగింది. ప్రభాస్ ఎపిసోడ్ అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఒకపక్క రాజకీయాలు మరోపక్క సినిమా రంగంలో… దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ షోకి వచ్చారు. డిసెంబర్ నెలలోనే పవన్ ఎపిసోడ్ షూటింగ్ జరుపుకుంది. దీంతో సంక్రాంతి పండుగకు పవన్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందని అందరూ భావించారు. కానీ పండుగ అయిపోయింది ఇప్పటికీ కూడా ఎపిసోడ్ ఎప్పుడో తెలీదు.

NBK X PSPK Power Teaser and Unstoppable With NBK S2

NBK X PSPK Power Teaser and Unstoppable With NBK S2

ఇలాంటి పరిస్థితులలో తాజాగా ఆహా యాజమాన్యం పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ టీజర్ రిలీజ్ చేసింది. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్..పవర్ టీజర్ అంటూ విడుదల చేయటం జరిగింది. ఈ టీజర్ లో.. చిరంజీవి గురించి ఇంకా పలు కాంట్రవర్సీ విషయాల గురించి పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ అడిగారు. టీజర్ లో పవన్ కళ్యాణ్ చాలా జోష్ మీద కనిపించారు. కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆహా “అన్ స్టాపబుల్” ఎపిసోడ్.. అన్ని రికార్డులు బ్రేక్ చేయడం గ్యారెంటీ అని మెగా మరియు నందమూరి అభిమానులు చెబుతున్నారు.

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి