
vijay devarakonda Liger movie pan india range craze
Liger Movie : విజయ్ దేవరకొండ చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులని పలకరించింది లేదు. రౌడీ బాయ్ కొన్నాళ్లుగా లైగర్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ 25న చిత్రం విడుదల కాబోతుంది. మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు సాగుతున్నాయి.ఈ క్రమంలో విజయ్ పలు విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ సమయంలో లైగర్‌కు బాయ్‌కాట్ సెగ తగిలింది. దీనికి కరణ్‌జోహార్ ఒక కారణమైతే, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మరో కారణంగా తెలుస్తుంది.
పూరి కనెక్ట్స్‌తో కలిసి కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో లైగర్ బాయ్‌కట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇక మరోవైపు ఓ ఇంటర్వ్యూలో లాల్‌సింగ్ చడ్డా బాయ్‌కాట్ చేయడంపై విజయ్ స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల చాలామంది కార్మికులు నష్టపోతారని కామెంట్స్ చేసి అమీర్‌ఖాన్‌కు మద్దతు తెలపడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే సినిమా రిలీజ్ కు ముందే వాళ్లకు పేమెంట్ ఇచ్చేస్తారు కదా..వాళ్లు నష్టపోయేదేముంది..ఇలా అమీర్ ఖాన్ ని సపోర్ట్ చేయటానికి సంభంధం లేని లాజిక్ లు తీస్తున్నారని కొందరు ఈ పిలుపు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ టూర్ పూర్తయ్యాక ఇంట్లో పూజలు జరిపించుకున్నారు. ఆ పూజ ఫొటోలు ట్వీట్ చేసారు. అవి చూసిన జనం..పూజ చేయటానకి వచ్చిన ముగ్గురు అర్చకులు నిలబడి ఉంటే విజయ్, హీరోయిన్ మాత్రం సోఫాలో కూర్చున్నారని బోయ్ కాట్ కి పిలుపు ఇస్తున్నారు.
Netizens Demanding LIGER Boycott Goes viral
టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయనపై చాలా తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇంకా సినిమా ఇండస్ట్రీకి చెందిన పిల్లల వారసుల్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఉత్తరాది ప్రేక్షకులు ఆయన సినిమాలను బాయ్‌కాట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ‘లైగర్’ సినిమా నిర్మాతల్లో కరణ్ జోహార్ ఒకరు కావడంతో ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌కాట్ చేయమని ట్విట్టర్ సాక్షిగా కూడా పిలుపు ఇస్తున్నారు. ఏదేమైన ప్రస్తుతం బాయ్‌కాట్ లైగర్ ట్రెండింగ్‌లో ఉంది. దీనిని విజయ్ ఎలా సాల్వ్ చేసుకుంటాడో చూడాలి మరి.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.