Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, నందమూరి ఫ్యామీలీస్ తర్వాత అక్కినేని, దగ్గుపాటి కుటుంబాలకు మళ్లీ అంతటి పలుకుబడి, గుర్తింపు ఉంటుంది. దగ్గుపాటి రామానాయుడు గారు సినిమా నిర్మాణం బాధ్యతలతో పాటు నటన పరంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దగ్గుపాటి కుటుంబం నుంచి వారసుడిగా వెంకటేశ్ ఒక్కరే అప్పట్లో సినిమాల్లోకి వచ్చారు. సురేశ్ బాబు తండ్రి వలే నిర్మాతగా వ్యహరించేవారు. ఇక అక్కినేని కుటుంబం నుంచి ఏఎన్నార్.. ఆయన వారసుడిగా నాగార్జున సినిమాల్లోకి వచ్చారు.
ఇక ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి.ఈ క్రమంలోనే ఏఎన్ఆర్ కొడుకు నాగార్జునకు రామానాయుడు కుమార్తె లక్ష్మిని ఇచ్చి వివాహం జరిపించారు. కానీ లక్ష్మి అప్పటికే అమెరికాలో చదువుకున్నారు. ఇండియాకు రావడం ఇష్టం లేకపోయినప్పటికి బలవంతంగా వచ్చి నాగార్జునను వివాహం చేసుకున్నారు.పెళ్లి తరవాత మళ్లీ నాగార్జునతో అమెరికాలోనే సెటిల్ అవుదామని అనుకున్నారట.. కానీ నాగార్జున ఇక్కడ సినిమాలు చేస్తుండటంతో విదేశాలకు రాలేనని చెప్పారట.అప్పటికే వీరికి నాగచైతన్య పుట్టాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చి విడాకులు తీసుకున్నారు. చైతూ చిన్నప్పుడు తన తల్లి వద్దే పెరిగాడు.
కానీ ఒక ఏజ్ వచ్చాక తండ్రి వద్దకు వచ్చి యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. జోష్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చైతూ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇదిలాఉండగా నాగ్ విడాకుల తర్వాత హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా లక్ష్మి కూడా విడాకుల తర్వాత మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరికి ఓ కుమారుడు పుట్టాడు.అలా చైతూకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు కూడా ఉన్నాడు.ఇప్పటికే అతడికి వివాహం కూడా జరిగింది. అయితే, చైతూ రెండో తమ్ముడు సినిమాల్లోకి రాకుండా వ్యాపార రంగంలో రాణిస్తున్నట్టు తెలుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.