jabardasth : సిగ్గు లేదా? టీఆర్పీ కోసం ఇలా చేస్తారా?.. జబర్దస్త్‌, మనో, రాకేష్‌లపై నెటిజన్లు ఫైర్

Authored By Cinema Desk | The Telugu News | Published on: November 7, 2021, 8:15 am

jabardasth  : సింగర్ మనో జబర్దస్త్ జడ్జ్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జడ్జ్‌గా టీమ్ మెంబర్స్‌కు స్కోర్ ఇవ్వడమే కాకుండా.. అప్పుడప్పుడు స్కిట్స్‌లో సందడి చేస్తుంటాడు మనో. అయితే ఇటీవల జబర్దస్త్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నెటిజన్లు మనోపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇందుకు కారణం.. ప్రోమోలో ఒక విధంగా చూపెట్టి.. స్కిట్‌లో అందుకు సంబంధించిన కంటెంట్ లేకపోవడమే. దీంతో టీఆర్‌పీల కోసం ఇంతకు దిగజారాలా అని రాకేష్‌తో పాటు మనో, జబర్దస్త్ టీమ్‌పై మండిపడుతున్నారు.

Netizens fires on jabardasth mano and rakesh

Netizens fires on jabardasth mano and rakesh

అసలేం ఏమైంది.. ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో.. మనో ఫుల్ సీరియస్ అయ్యాడు. టీమ్ లీడర్ రాకేష్‌పై సీరియస్‌ అయి.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా చూపెట్టారు. రాకేష్ స్కిట్‌పై కామెంట్స్ చేసిన మనో.. ‘ఎంత గౌరవం అయ్యా.. రాకేష్ నువ్వంటే నాకు రాకేష్. ఏమిటిది పద్దతేనా అసలు.. ఏ స్టేజ్.. నువ్వు చేస్తుంది ఏమిటి..?’ అని అడిగాడు. అయితే రాకేష్ కామెడీగా అని సమాధానం ఇచ్చాడు. దీంతో మనో ఐయాం సో సారీ అంటూ జడ్జ్ సీటులో నుంచి లేచి వెళ్లిపోయాడు. రాకేష్ ఆపడానికి వెళ్లి సారీ సార్ అని చెప్పాడు.. అయితే మనో మాత్రం ఆయనపై చేయి ఎత్తాడు. ఆ తర్వాత రోజకు సారీ చెప్పి బయటకు వెళ్తున్నట్టుగా చూపెట్టారు.

jabardasth  : జబర్దస్త్ షో మీద నెటిజన్లు ఫైర్..

Netizens fires on jabardasth mano and rakesh

Netizens fires on jabardasth mano and rakesh

అయితే ఈ ప్రోమో చూసిన జనాలు ఇదంతా వట్టిదేనని అప్పుడే పసిగట్టారు. డ్రామాలు అంటూ ఫైర్ అయ్యారు. అయితే తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో అందుకు సంబంధించి ఎలాంటి సీన్స్‌ లేకపోవడంతో ఫుల్‌గా ఫైర్‌ అవుతున్నారు. టీఆర్‌పీలో మరి ఇంత దారుణంగా చేస్తారా అంటూ మండిపడుతున్నారు.. ప్రోమో‌లో చూపెట్టింది ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్‌ టీమ్‌పై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రోమో కోసం పడ్డపాట్లు ఇలా చీవాట్లు పెట్టిస్తున్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp