New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : ఈ మ‌ధ్య సినీ పరిశ్ర‌మ‌కి కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అవుతున్నారు. కుబేర‌ లో న‌టించిన విల‌న్ హఠాత్తుగా మన పాత విలన్ రఘువరన్ ని గుర్తుకు తెచ్చాడు. కాస్త అలాగే ఫేస్ కట్, బాడీ లాంగ్వేజీ, కళ్లల్లోనే పలికించే స్మార్ట్ క్రూర విలనీ… అప్పట్లో నాగార్జున, రఘువరన్… ఇప్పుడు అదే నాగార్జున ఈ విలన్… పేరు జిమ్ సర్బ్… పేరు, మొహం చూడగానే విదేశీయేమో అనుకున్నా

New Villain టాలీవుడ్‌కి కొత్త విల‌న్ ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : అద‌రగొట్టేశాడు..

అచ్చమైన ముంబైకర్… పార్శీ జొరాస్ట్రియన్ ఫ్యామిలీ… తల్లి ఫిజియో థెరపిస్ట్… తండ్రి మాజీ మాస్టర్ మెరైనర్… కొన్నాళ్లు అమెరికాలో కూడా చదువుకున్నాడు… సైకాలజీ గ్రాడ్యుయేట్… నటన అన్నా నాటకాలన్నా ప్యాషన్… అట్లాంటాలో ఏదో థియేటర్ కంపెనీకి వర్క్ చేశాడు… ముంబై వచ్చాక కూడా అదే పని…

తను రచయిత, నాటక దర్శకుడు, నటుడు… నీర్జా, పద్మావత్, సంజు, మేడ్ ఇన్ హెవెన్, గంగూభాయ్ తదితర సినిమాల్లో పాత్రలు… రాకెట్ బాయ్స్‌ వెబ్ సీరీస్‌లో హోమీ బాబా… సినిమాలు, వెబ్ సీరీస్ బాగానే చేస్తున్నా రావల్సినంత గుర్తింపు రాలేదేమో అనిపించింది… శేఖర్ కమ్ములకు ఎవరు సజెస్ట్ చేశారో గానీ, కుబేరలో అవ‌స‌ర‌మైన పాత్ర‌కి డర్టీ అండ్ క్రుయల్ బిజినెస్‌మ్యాన్ పాత్రకు మాత్రం సరిగ్గా సూటయ్యాడు… కుబేర‌లో పాత్రకు అవసరమైన దుష్టత్వాన్ని చూపించాడు .చూస్తుంటే రానున్న రోజుల‌లో ఆయ‌న టాలీవుడ్ ప్ర‌ముఖ విల‌న్‌గా మార‌నున్నాడ‌ని అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది