prabhas fans gets good news
Prabhas : హాలీవుడ్ సినిమాలకు సరిపోయే కటౌట్ మన గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ది. ఆయన పక్క హీరోయిన్ అంటే కనీసం ఆరడుగుల దాకా హైట్ ఉండాల్సిందే. ఎందుకంటే ప్రభాస్ హైట్ ఆరు పైనే ఉంటుంది. ప్రభాస్‌కు అంత త్వరగా హీరోయిన్ సెట్ అవదు. అనుష్క, నమిత, దీపిక పదుకొనె లాంటి
హైట్ అలాగే దిట్టంగా ఉండే హీరోయిన్స్ మాత్రమే సెట్ అవుతారు. ఇప్పుడు కూడా అలాంటి సాలీడ్ హీరోయిన్ ప్రభాస్ కొత్త సినిమాకు సెట్ అయినట్టు సమాచారం. డార్లింగ్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన రెండు సినిమాలు
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులను మెప్పించక బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి.
అందుకే, ప్రభాస్ నుంచి సాలిడ్ కమ్ బ్యాక్ మూవీ కావాలి అని ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు. ప్రభాస్ కం బ్యాక్ కి సలార్ సినిమా అయితే కరెక్ట్ అంటున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ అదే స్థాయిలో సినిమాని ఎంతో
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి, సాహో ఇప్పుడు సలార్ అన్ని యాక్షన్ సినిమాలే, ఆదిపురుష్, ప్రాజెక్ట్ క్ కూడా భారీ చిత్రాలే. అయితే, ఇవి కాస్త డిఫరెంట్ జోనర్‌లో తెరకెక్కుతున్నవి. ఇక దర్శకుడు మారుతి తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా హారర్ కమ్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు మారుతీ. ఈ మూవీని సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకోని వెళ్లేలా, తన షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాడట.
Next to this cutout is this solid beauty heroine
అయితే ప్రభాస్ – మారుతీ ప్రాజెక్ట్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా మాళవిక మోహనన్ ఫైనల్ అయినట్లు సమాచారం. కోలివుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న మాళవిక మోహన్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి హైట్ ఉండే మాళవిక, మంచి ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ ఉంటుంది. ప్రభాస్ పక్కన పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని చెప్పుకుంటున్నారు. అనుష్క తర్వాత ప్రభాస్ పక్కన ఆ హైట్ ని మ్యాచ్ చేసే హీరోయిన్ కనిపించలేదు. పూజా హెగ్డే ప్రభాస్ పక్కన బాగానే కనిపించింది. కానీ ఎందుకో పెద్దగా క్రేజ్ రాలేదు. మారుతీ సినిమా అంటే హీరోయిన్ ని బాగా చూపిస్తాడు. కాబట్టి మాళవిక మోహన్ ని ప్రభాస్ కి పర్ఫెక్ట్ జోడి అనేలా ప్లాన్ చేస్తున్నారట.
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
This website uses cookies.