Niharika : జిమ్‌లో తెగ కష్టపడుతున్నారు.. భర్తతో కలిసి నిహారిక సందడి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 24, 2022, 11:00 am

Niharika : మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ కూడా ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య కూడా విబేధాలు వచ్చాయని, విడిపోయారంటూ ఇలా ఏవేవో రాసేశారు. నిహారిక ఇన్ స్టా గ్రాం నుంచి వైదొలగడంతో ఇలాంటి పిచ్చి వార్తలన్నీ పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని చైతన్య తన పోస్టులతో తెలిపేవాడు. అయితే నిహారిక ఒంటరిగా పబ్బు వ్యవహారంలో దొరకడంతో మరింతగా ఈ వార్తలు వేడెక్కాయి. డిప్రెషన్‌లో ఉందని అందుకే ఇలాంటివి చేస్తోందంటూ పబ్ వ్యవహారాన్ని నానా హంగామా చేశారు.

నిహారిక డ్రగ్స్ తీసుకుందా? అనే కోణంలోంచి జనాలు ఆలోచిస్తున్నారు. అలా మొత్తానికి నిహారిక వ్యవహారం మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వార్తకు దారి తీస్తోంది. ఆ పబ్ వ్యవహారం మీద నాగబాబు వివరణ ఇచ్చినా అదంతా సమంజసంగా లేదనే టాక్ వచ్చింది. అయితే నిహారిక మాత్రం కాస్త గ్యాప్ తీసుకుంది. ఈ వ్యవహారాల్లోంచి బయటకు వచ్చేందుకు విదేశాలకు వెకేషన్‌కు వెళ్లింది. తన భర్తతో కలిసి నిహారిక జోర్డాన్‌కు వెళ్లింది. వారానికి పైగా అక్కడే వెకేషన్‌ను ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.అయితే నిహారిక ప్రస్తుతం మళ్లీ ఇన్ స్టాగ్రాంలో యాక్టివ్ అయింది. కమ్ బ్యాక్ ఇచ్చిన సమయంలోనూ నిహారిక ఓ పోస్ట్ చేసింది.

Niharika and chaitanya JV In Gym

Niharika and chaitanya JV In Gym

ఈ మధ్య కాలంలో తాను మూడు విషయాలు నేర్చుకున్నాను అంటూ తన మీద వచ్చిన కాంట్రవర్సీల మీద పరోక్షంగా రియాక్ట్ అయింది. అయితే నిహారిక ఇప్పుడు తన భర్తతో కలిసి జిమ్‌లో కష్టపడుతోంది. ఇక చైతన్య అయితే బీస్ట్ మోడ్‌లోకి మారిపోయాడు. చైతన్య కంటిన్యూగా జిమ్ చేస్తున్నాడు. నిహారిక కూడా భర్తతో పాటే జిమ్‌కు వస్తోంది. తాజాగా తన జిమ్ ట్రైనర్ గురించి చెప్పుకొచ్చారు.తమ జిమ్ ట్రైనర్ కొత్త సెంటర్ ఓపెన్ చేశాడంటూ నిహారిక, చైతన్యలు చెప్పుకొచ్చారు. అతనికి కంగ్రాట్స్ చెబుతూ కొత్త జిమ్ సెంటర్‌ను చూపించారు. ఇక నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. నటిస్తూ నిర్మిస్తూ ఓటీటీల్లో తనకంటూ ఓ మార్క్ చూపిస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp