Niharika : ఘాటు స్టెప్పులతో మతి పోగొడుతున్న నిహారిక.. నెటిజన్లు ఫిదా.. ఓల్డ్‌ వీడియో వైర‌ల్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Niharika : ఘాటు స్టెప్పులతో మతి పోగొడుతున్న నిహారిక.. నెటిజన్లు ఫిదా.. ఓల్డ్‌ వీడియో వైర‌ల్‌..!

 Authored By mallesh | The Telugu News | Updated on :6 April 2022,7:00 pm

Niharika మెగా కుటుంబం నుండి హీరోలు ఎవరు వచ్చినా వారికి ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. మెగా హీరోలు కూడా తమలోని ట్యాలెంట్‎తో అభిమానుల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే మెగా కుటుంబం నుండి హీరోలకు భిన్నంగా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి..   తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరోయిన్ నిహారిక. నాగబాబు కూతురుగా వెండి తెర మీదే కాదు, బుల్లితెర మీద ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది.‘సూర్యకాంతం’ సినిమాతో పెంకి పిల్లగా గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్ కు సంబంధించిన ఒక‌ ఓల్డ్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అటు సినిమాలతో, అప్పుడప్పుడు బుల్లితెర మీద కొన్ని షోలలో హడావిడి చేస్తున్న ఈ అమ్మడి ఓల్డ్‌ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేయిస్తోంది. కొరియోగ్రాఫర్ యాష్ తో కలిసి నిహారిక చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.బ్లాక్ డ్రెస్ లో, బ్లూ లైటింగ్ లో నిహారిక..   యాష్ తో కలిసి వేసిన స్టెప్పులు ఎంతో అద్భుతంగా ఉండటంతో పాటు ఆకట్టుకుంటున్నాయి. నిహారిక యాక్టింగ్, కామెడీ టైమింగ్ ను చూసిన వారికి ఇప్పుడు ఏకంగా తన డ్యాన్స్ తో ఆకట్టుకుంటోంది…

niharika dance with yash video Viral

niharika dance with yash video Viral

Niharika : యశ్ తో హాట్ స్టెప్పులు..

మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గన్నట్లుగా నిహారిక తన డ్యాన్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. డ్యాన్స్ హైలెట్ అని, అదుర్స్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.కాగా మొన్నీమధ్యన పెళ్లి చేసుకున్న నిహారిక.. సినిమాల్లో కానీ, టీవీ షోల్లో కానీ పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా హైదరాబాద్ లో ఓ పబ్ లో డ్రగ్స్ తో పట్టుబడిన వీఐపీల జాబితాలో నిహారిక కూడా ఉన్నట్లు పలు వార్తా ఛానల్స్ లో వార్తలు వచ్చాయి. దీనిపై నిహారిక తండ్రి నాగబాబు స్పందిస్తూ.. తన కూతురు బంగారం అని చెప్పడం తెలిసిందే.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది