
niharika issue clears the naga babu wife
Niharika : మెగా బ్రదర్ నాగబాబు ముద్దులు కూతురు నిహారిక గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంతో నిహారిక పేరు వార్తలలో తెగ నానింది. ఆ పబ్‌లో అర్థరాత్రి దాటాక కూడా వందలాదిమంది వుండడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మెగా డాటర్ నిహారిక అర్థరాత్రి తరవాత పబ్ లో ఉన్నారనే కారణంతో నిహారిక తో పాటూ మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఏం జరిగింది? తనపై వచ్చిన ఆరోపణలపై నిహారిక స్పందించారు. తాజాగా నిహారిక, పద్మజ కొణిదెల ఇద్దరూ కూడా ఓ మీడియా చానెల్‌తో ముచ్చటించారు.
మదర్స్ డే సందర్భంగా ఈ ఇద్దరూ ముచ్చట్లు పెట్టారు. అయితే నిహారిక మీద వచ్చే వార్తలు, ఇష్యూల మీద అమ్మగా మీరు ఎలా రియాక్ట్ అవుతుంటారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి పద్మజ ఏ మాత్రం తడబడకుండా సమాధానం ఇచ్చారు. ‘అలాంటి వార్తలు రావడంప్రారంభంలో కొంచెం ఇబ్బందిగా అనిపించేది.. కానీ మేం ఉన్న దానికి అలాంటివి తప్పవు. లేదంటే ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోవాలి. తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిహారిక ఏంటో మా వాళ్లకి తెలుసు. మనం బాగున్నామంటే ఎదుటి వాళ్లు మనల్ని కష్టపెట్టాలని, రాళ్లు వేయాలని చూస్తుంటారు.. నాకు మా బావ గారున్నారు.. మా బావ గారున్నంత వరకు మాకేం పర్వాలేదు’ అని అన్నారు.
niharika issue clears the naga babu wife
నిహారిక పబ్ ఇష్యూ ఎంతటి హాట్ టాపిక్‌గా మారిందో అందరికీ తెలిసిందే. ఆ ఘటన తరువాత నిహారిక మీద లెక్కలేనంత ట్రోలింగ్ నడిచింది. మొత్తానికి ఇప్పుడు మళ్లీ ఇన్ స్టాగ్రాంలో బ్యాక్ అయింది. ఇటీవలే భర్తతో కలిసి జోర్డాన్ ట్రిప్ వేసి వచ్చింది. త్వరలో నిహారిక సరికొత్త షోతో సందడి చేయనుందని అంటున్నారు. బుల్లితెరపై నటిగా, హోస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. నిర్మాతగా కూడా కొన్ని వెబ్ సిరీస్‌లను నిర్మించింది. హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హీరోయిన్‌గా ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో డిజిటల్, బుల్లి తెరపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టేసింది. రెండేళ్లు ముందు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.