Niharika Konidela : విడాకులైన పిల్లలు కావాలంటూ మనసులో కోరిక బయటపెట్టిన నిహారిక
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల నిత్యం వార్తలలో నిలుస్తుంది. విడాకుల తర్వాత ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో తెగ మారుమ్రోగిపోతుంది. ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకున్న నిహారిక పట్టుమని మూడేళ్లు కూడా కాపురం చేయకుండా చైతన్య అనే వ్యక్తి నుండి విడిపోయింది. ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టింది. సినిమాలలో నటిస్తూ మంచి కథలని సెలక్ట్ చేస్తూ నిర్మాతగా మూవీస్ చేసే ప్రయత్నం చేస్తుంది. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే..”చెఫ్ మంత్ర” అంటూ యూట్యూబ్ ఛానెల్లో సందడి చేస్తుంది మెగా డాటర్. ”సాగు” అనే సినిమాకు ప్రజంటర్‌గా కూడా పని చేసింది నిహారిక. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది.
ఓ ఇంటర్వ్యూలో నిహారిక తనకు పిల్లలంటే చాలా ఇష్టమని తెలియజేసింది. అప్పుడు సదరు యాంకర్ మిమ్మల్ని మళ్లీ పెళ్లి కూతురుగా చూడొచ్చా అని అడగగా, దానికి సమాధానం ఇస్తూ.. ఏమో అది తెలియదు కానీ.. పిల్లలు కావాలనిపిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.అయితే పిల్లలు కావాలంటే పెళ్లి చేసుకోవాలి కాబట్టి అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. పెళ్లి గురించి ఇప్పుడే చెప్పలేం అంటూ రెండో పెళ్లిపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసింది నిహారిక. ఇక ప్రేమపై తనకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదని చెప్పడంతో నిహారిక ప్రేమించి పెళ్లి చేసుకోనుందా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు.
ఇక పర్సనల్ లైఫ్ సంగతెలా ఉన్నా వృత్తిపరంగా మాత్రం దూసుకుపోతుంది నిహారిక. డివోర్స్ తీసుకున్న తర్వాత గ్లామర్ డోస్ కూడా బాగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల. సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది నిహారిక. బాబాయ్ పార్టీకి మద్దతుగా కూడా తాను ఉంటానంటుంది.జనసేన పార్టీ తరుఫున పని చేయడానికి మెగా ఫ్యామిలీ సిద్ధంగా ఉందని నిహారిక తెలిపింది. అంతేకాదు తాను తన తండ్రి కోసం ఆంధ్రాలో ఇల్లు కూడా తీసుకుంటానని పేర్కొంది. ఇక నిహారిక ఇప్పుడు మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా ”వాట్ ది ఫిష్” అనే సినిమాలో నటిస్తుంది. అలానే పలు తమిళ సినిమాలు కూడా చేస్తుంది.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.