Niharika Konidela : విడాకులైన పిల్ల‌లు కావాలంటూ మ‌నసులో కోరిక బ‌య‌ట‌పెట్టిన నిహారిక‌

Authored By Ramu | The Telugu News | Updated on : 15 March 2024, 5:15 pm
  •  Niharika Konidela : విడాకులైన పిల్ల‌లు కావాలంటూ మ‌నసులో కోరిక బ‌య‌ట‌పెట్టిన నిహారిక‌

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవ‌ల నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. విడాకుల త‌ర్వాత ఈ అమ్మ‌డి పేరు సోష‌ల్ మీడియాలో తెగ మారుమ్రోగిపోతుంది. ఎంతో అట్ట‌హాసంగా పెళ్లి చేసుకున్న నిహారిక ప‌ట్టుమ‌ని మూడేళ్లు కూడా కాపురం చేయ‌కుండా చైతన్య అనే వ్య‌క్తి నుండి విడిపోయింది. ప్ర‌స్తుతం కెరీర్‌పైనే పూర్తి ఫోక‌స్ పెట్టింది. సినిమాల‌లో న‌టిస్తూ మంచి క‌థ‌లని సెల‌క్ట్ చేస్తూ నిర్మాత‌గా మూవీస్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే..”చెఫ్ మంత్ర” అంటూ యూట్యూబ్‌ ఛానెల్లో సందడి చేస్తుంది మెగా డాట‌ర్. ”సాగు” అనే సినిమాకు ప్రజంటర్‌గా కూడా ప‌ని చేసింది నిహారిక. ఈ క్ర‌మంలో మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌లు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చింది.

ఓ ఇంట‌ర్వ్యూలో నిహారిక త‌న‌కు పిల్ల‌లంటే చాలా ఇష్ట‌మ‌ని తెలియ‌జేసింది. అప్పుడు సద‌రు యాంకర్ మిమ్మల్ని మళ్లీ పెళ్లి కూతురుగా చూడొచ్చా అని అడ‌గ‌గా, దానికి సమాధానం ఇస్తూ.. ఏమో అది తెలియదు కానీ.. పిల్లలు కావాలనిపిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.అయితే పిల్ల‌లు కావాలంటే పెళ్లి చేసుకోవాలి కాబ‌ట్టి అది ఎప్పుడు జ‌రుగుతుందో తెలియ‌దు. పెళ్లి గురించి ఇప్పుడే చెప్పలేం అంటూ రెండో పెళ్లిపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసింది నిహారిక‌. ఇక ప్రేమపై త‌న‌కు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదని చెప్ప‌డంతో నిహారిక ప్రేమించి పెళ్లి చేసుకోనుందా అని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

ఇక పర్సనల్ లైఫ్ సంగతెలా ఉన్నా వృత్తిపరంగా మాత్రం దూసుకుపోతుంది నిహారిక. డివోర్స్ తీసుకున్న తర్వాత గ్లామ‌ర్ డోస్ కూడా బాగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల. సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది నిహారిక‌. బాబాయ్ పార్టీకి మద్దతుగా కూడా తాను ఉంటానంటుంది.జనసేన పార్టీ తరుఫున పని చేయడానికి మెగా ఫ్యామిలీ సిద్ధంగా ఉందని నిహారిక తెలిపింది. అంతేకాదు తాను త‌న తండ్రి కోసం ఆంధ్రాలో ఇల్లు కూడా తీసుకుంటాన‌ని పేర్కొంది. ఇక నిహారిక ఇప్పుడు మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా ”వాట్ ది ఫిష్” అనే సినిమాలో న‌టిస్తుంది. అలానే ప‌లు త‌మిళ సినిమాలు కూడా చేస్తుంది.

Advertisement

Ramu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి