Niharika Konidela : తండ్రి స్టార్ మాలో.. కూతురు ఈటీవీలో.. నిహారిక ఎంట్రీ అదిరింది
Niharika Konidela : నాగబాబు మల్లెమాల మీద చేసిన కామెంట్లు, జబర్దస్త్ షో మీద చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. వెళ్తూ వెళ్తూ ఐదారు వీడియోలు చేసి, మల్లెమాల పరువుతీసి, శ్యాం ప్రసాద్ రెడ్డి మీద ఆరోపణలు చేసి, జబర్దస్త్ షోను కించపరిచి వెళ్లిపోయాడు. నితిన్ భరత్‌లకు అండగా ఉండేందుకు బయటకు వచ్చానని నాగబాబు చెప్పాడు. దానికి తగ్గట్టే కొన్ని రోజులు వారితో పాటున్నాడు. ఆ తరువాత మళ్లీ పక్కకు వెళ్లాడు.
అయితే నిహారికకు మొదట్లో బుల్లితెరపై చాన్స్ ఇచ్చింది కూడా మల్లెమాలనే. ఢీ షోలో ఆమె యాంకరింగ్ చేసింది. ఆ తరువాత మల్లెమాల ఈవెంట్లన్నింట్లోనూ కనిపించేది. మొత్తానికి ఆమెకు కెమెరా భయాన్ని పోగొట్టేలా చేసింది మల్లెమాల. అలా నాగబాబు తన కూతురికి మంచి ఫ్లాట్ ఫాం కల్పించాడు. ఇక ఇప్పుడు చూస్తుంటే నాగబాబు అయితే మల్లెమాలకు ఆమడ దూరంలో ఉంటున్నాడు.
Niharika Konidela in Latest Sridevi Drama Company Promo
Niharika Konidela : నిహారిక ఎంట్రీ అదుర్స్..
జీ తెలుగు, స్టార్ మా, యూట్యూబ్ చానెల్ అంటూ అటే తిరుగుతున్నాడు. కానీ ఈటీవీ మల్లెమాల వైపు మాత్రం చూడటం లేదు. కానీ తాజాగా నిహారిక మాత్రం ఈటీవీ, మల్లెమాలలోకి అడుగు పెట్టేసింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇదేంటి? నిహారిక వచ్చింది? అదెలా సాధ్యమంటూ అందరూ ఆశ్చర్యపోతోన్నారు. మొత్తానికి తండ్రి అక్కడ కూతురు ఇక్కడ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక నిహారిక రాకతో పంచుల వర్షం మరింతగా కురిసింది. వచ్చే వారం చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. అందుకే నిహారికను ఇలా తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి నిహారిక కూడా తన ఒరిజినాలిటీని చూపించి పంచ్‌లతో దడదడలాడించింది.
