Kalyan Ram said he could not study because of his father..?
Kalyan Ram : నందమూరి నటవారసుడు, హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణపై సంచలన కామెంట్స్ చేశారు. బాబాయ్ వల్లే తను చిన్నతనంలో చదువుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.అంతలా ఏం జరిగింది. ఎన్నడూ లేనిది కళ్యాణ్ రామ్ బాలయ్య బాబుపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంటని అంతా షాక్ అవుతున్నారు.అసలు ఏం జరిగిందో కళ్యాణ్ రామ్ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా బింబిసార మూవీతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పటాస్ హిట్ అనంతరం చాలా కాలం తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పడింది.
ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ళ పరంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని అంటున్నారు. దీంతో బింబిసార సినిమా మూవీ యూనిట్ మొత్తం సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్‌తో పాటు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవితో స్పెషల్ చిట్ చాట్‌లో పాల్గొన్నాడు కళ్యాణ్ రామ్. ఈమూవీలో బేబీ శ్రీదేవి శాంభవి అనే పాత్రలో అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే.ఈ పాప చుట్టే బింబిసార మూవీ మొత్తం తిరుగుతుంది. తాజాగా శ్రీదేవితో కళ్యాణ్ రామ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..
Kalyan Ram said he could not study because of his father..?
తన కెరియర్ కూడా ఇలాగే బాల నటుడిగా ప్రారంభమైందని గుర్తుచేసుకున్నాడు.శ్రీదేవి తన స్టడీస్ గురించి చెప్తుండగా..కళ్యాణ్ రామ్ కూడా తన స్కూల్ డేస్ గురించి చెప్పుకొచ్చాడు.తన బాబాయ్ బాలకృష్ణ తనను బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడని ఆయన వల్లే సినిమాల్లోకి వచ్చినట్టు చెప్పాడు. ఆ రోజుల్లో నేను సినిమాల్లో నటించేటప్పుడు కోక్ కావాలి, చాక్లెట్ ఇస్తానే షూటింగ్‌కు వస్తానని బెదిరించే వాడిని.షూటింగ్ అనంతరం ఇంటికి వెళ్లిపోయేవాడిని.అంతేగాని ఒక్క బుక్కు కూడా చదివే వాడిని కాదు. దాంతో నా స్టడీస్ మొత్తం పోయాయి. మాకు అప్పట్లో 45 వస్తే పాస్. నాకు 46, 47మార్కులు వచ్చేవి.అలా బాబాయ్ తనను సినిమాల్లోకి తీసుకుని రావడంతో నా చదువు మొత్తం పోయిందంటూ కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.