Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇవి చాలా ఎమోషనల్‌గా నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. బుధవారం బిగ్‌బాస్ హౌజ్‌లోకి యష్మి తండ్రితో పాటు నిఖిల్ తల్లి ఎంట్రీ ఇచ్చారు. తండ్రిని చూడగానే యష్మి ఎమోషనల్ అయిపోయింది. తెగ ఏడ్చేసింది. నిఖిల్, పృథ్వీ, అవినాష్‌తో పాటు అందరిని యష్మి తండ్రి పలకరించాడు. గ్రూప్ గేమ్ కాకుండా ఇండివిడ్యువల్ గేమ్ ఆడమని కూతురికి యష్మి తండ్రి సలహా ఇచ్చాడు.తండ్రిని ఆప్యాయంగా యష్మి హత్తుకుంది. యష్మి తండ్రి ఇతర ఇంటి సభ్యులతో సరదాగా ముచ్చటించారు. రోహిణి అయితే.. అంకుల్ ఆఫీసర్ లాగా పవర్ ఫుల్ గా ఉన్నారు. ఒక్కటిచ్చారంటే మూతి ముక్కు వంకర గ్యారెంటీ అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.
అనంతరం యష్మి తన తండ్రితో ఏకాంతంగా మాట్లాడింది. బిగినింగ్ లో గేమ్ బాగా ఆడుతున్నావు. కానీ ఇప్పుడు ఏమైందది నీకు.. గేమ్ పై ఫోకస్ చెయ్ అని యష్మి కి సూచించారు. నీపై బయట చాలా బ్యాడ్ టాక్ ఉంది.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు కూడా. ఇకపై నన్ను నేను మార్చుకుంటా అని యష్మి తండ్రికి మాట ఇచ్చింది. ఆ తర్వాత యష్మి తండ్రి హౌస్ ని వదిలి వెళ్లారు. .తన కూతురు ఆవేశంలో ఏదైనా అంటే క్షమించమని హౌజ్‌లోని కంటెస్టెంట్స్ అందరిని కోరాడు యష్మి తండ్రి. ఇదంతా గేమ్ మాత్రమేనని, తమ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని కంటెస్టెంట్స్ ఆయనకు బదులిచ్చారు.
యష్మి విషయంలో కొడుకు గట్టిగానే క్లాస్ ఇచ్చింది నిఖిల్ తల్లి. యష్మి లవ్ అంటే నీ వెంట పడుతుంటే నువ్వెందుకు ఎంకరేజ్ చేస్తున్నావని ఫైర్ అయ్యింది. యష్మిని కంట్రోల్‌లో పెట్టమని అన్నది. యష్మి కారణంగానే నిఖిల్ హౌజ్‌లో నెగెటివ్ అయిపోతున్నాడని చెప్పకనే చెప్పింది. యష్మితో పాటు ప్రేరణకు కూడా దూరంగా పెట్టమని ఇన్‌డైరెక్ట్‌గా కొడుకుకు చెప్పింది.హౌజ్‌లోకి తన ఫ్యామిలీ మెంబర్స్ రారని తెలిసి తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తమ పేరెంట్స్ బదులుగా తేజ పేరెంట్స్‌ను పంపించమని గౌతమ్, రోహిణి బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్‌చేశారు. ఇక నిఖిల్ తల్లి వెళ్ళిపోయాక అవినాష్ భార్య అనూజ ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ బెడ్ పై పడుకుని ఉంటే.. అనూజ సైలెంట్ గా వెళ్లి అతడిని హగ్ చేసుకుంది. దీనితో అవినాష్ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాడు. భార్య భర్తలు ఇద్దరూ కాసేపు రొమాంటిక్ గా గడిపారు. బిగ్ బాస్ షోని తాను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానని అనూజ తెలిపింది.
Nagababu : ప్రముఖ సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు Nagababu మంత్రి అయినట్లేనని అంతా అంటున్నారు. రానున్న మార్చి…
PVC Aadhaar Card : నేటి ప్రపంచంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. మీరు బ్యాంకింగ్, ఆస్తి…
Local Body Elections : తెలంగాణలో Telangana వరుస ఎన్నికల సమరానికి సీఎం రేవంత్ Revanth reddy రంగాన్ని సిద్ధం…
Chiranjeevi : ఇటీవల సోషల్ మీడియాలో పాజిటివిటీ కన్నా నెగెటివిటీ ఎక్కువగా ఉంది. మొత్తం నెగిటివిటినే. సినిమా నచ్చకపోతే చెప్పండి…
NTR : టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు nandamuri taraka rama rao వర్ధంతి…
Cheese : మనం మార్కెట్లో కొన్ని ప్రాంతాలను ఎక్కువ రేటు పెట్టి కొని తెచ్చుకుంటాము. వాటితో లగ్జరీ లైఫ్ ని…
Hyderabad Metro : వేగవంతమైన మరియు సమర్థవంతమైన "గ్రీన్ కారిడార్"ను అందించడం ద్వారా ప్రాణాలను రక్షించే గుండె మార్పిడి ప్రక్రియలో…
LIC New Money Back Scheme: మీరు మీ సతీమణి కోసం ఉత్తమమైన ఎల్ఐసీ పాలసీని ఎంచుకోవడం ఎంతైన అవసరం…
This website uses cookies.