Home » Entertainment » Nirupam And Manjula Paid Fine At Mumbai
Entertainment

Karthika Deepam : డాక్టర్ బాబుకే ఫైన్ వేసేశారు.. భార్యతో ఉండగా నిరుపమ్‌కు చేదు అనుభవం!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 2, 2021, 4:00 pm
Advertisement

Karthika Deepam : మన తెలుగు వాళ్లకు డాక్టర్ బాబు అంటే అందరికీ తెలిసిందే. బయట ఎక్కడైనా కనిపిస్తే డాక్టర్ బాబు అంటూ నిరుపమ్‌ను చుట్టు ముట్టేస్తారు. మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు నిరుపమ్ స్టార్ సెలెబ్రిటి. కానీ పక్కరాష్ట్రాలకు వెళ్తే అక్కడ ఓ సాధారణ వ్యక్తిలాంటి వాడే. అలా తాజాగా నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి ముంబైకి వెళ్లాడు. యాడ్ షూటింగ్ కోసమని, మొదటిసారి తామిద్దరం కలిసి నటిస్తున్నామని నిరుపమ్ తెలిపాడు. అయితే ఈ క్రమంలో డాక్టర్ బాబు తన యూట్యూబ్ చానెల్ కోసం స్పెషల్ వీడియో చేశాడు.

Advertisement

Nirupam And Manjula Paid Fine AT Mumbai

మంజుల నిరుపమ్ అనే యూట్యూబ్ చానెల్‌ను ఈ జోడి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలా తాజాగా రకరకాల వీడియోలను షేర్ చేస్తూ వచ్చారు. అన్నీ కూడా మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతున్నాయి. అయితే ఈ ముంబై వ్లాగ్‌ను కూడా షేర్ చేశారు. అందులో మొదటి పార్ట్‌‌ను రిలీజ్ చేశారు. హైద్రాబాద్ నుంచి ముంబైకి వెళ్లిన తీరు.. అక్కడ దిగిన తరువాత జరిగిన ఘటనలను షేర్ చేశారు. అక్కడి సెలెబ్రిటీల ఇళ్లు, ముంబై బీచ్ వ్యూ అంటూ ఇలా అన్ని చూపించారు.

Advertisement

Nirupam And Manjula Paid Fine AT Mumbai

అయితే ముంబైలో కరోనా నిబంధనలు గట్టిగానేఫాలో అవుతున్నట్టున్నారు. బీచ్ రోడ్డులో మాస్కులు లేకుండా కనిపిస్తే ఫైన్లు వేస్తున్నారట. అలా నిరుపమ్, మంజుల తమ వ్లాగ్ కోసం మాస్కులు తీసి అక్కడి విశేషాలను వివరిస్తూ వచ్చారు. దీంతో అక్కడి సెక్యురిటీ గార్డులు వచ్చి ఫైన్ వేశారు. చెరో రెండోందల చొప్పున నాలుగు వందలు ఫైన్ కట్టారు. ఆ తరువాత మళ్లీ మాస్కులు ధరించారు. ఇది కూడా మంచి అనుభవమే.. ఇకపై ఎప్పుడూ కూడా మాస్కులు తీయమని నిరుపమ్ అన్నాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి