Home » Entertainment » Actress Pragathi Workouts Goes Viral
Entertainment

Pragathi : ఇవేం వర్కవుట్లు రా బాబోయ్.. చెమటలు పట్టిస్తున్న నటి ప్రగతి

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 2, 2021, 2:50 pm
Advertisement

Pragathi : నటి ప్రగతి గురించి అందరికీ తెలిసిందే. గత ఏడాది నుంచి సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. వర్కవుట్ల వీడియోలు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇక ఆమె పేరు మీడియా, సోషల్ మీడియాలో మార్మోగని రోజంటూ లేదు. అలా గత ఏడాది లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ప్రగతి ఇమేజ్‌లో ఎంతో మార్పు వచ్చింది. ఆమె తన ఫిట్ నెస్ గురించి చెబుతూ షేర్ చేస్తోన్న వీడియోలు ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నాయి.

Advertisement

Actress Pragathi Workouts Goes Viral

నాలుగు పదుల వయసులో ఈ రేంజ్ వర్కవుట్లు చేస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు. ఇక లుంగి కట్టి ఆమె వేసిన మాస్ స్టెప్పులు చూసి అందరూ నోరెళ్లబెట్టేశారు. ఆమెలోని ఈ కొత్త టాలెంట్లను చూసి అందరూ నివ్వెరబోయారు. చిన్నప్పటి నుంచే ఫిట్ నెస్ మీద ధ్యాస, డ్యాన్సుల మీద మక్కువ ఉండేదని ప్రగతి చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆమెకు వస్తున్న పాత్రలు, దర్శక నిర్మాతలు ఇస్తున్న పాత్రలు కూడా వేరే లెవెల్‌లో ఉంటున్నాయి.

Advertisement

pragathi-has come to industry after marriage

బుల్లితెరపై అయితే లీడింగ్ క్యారెక్టర్స్, మగరాయుడి పాత్రలను ఇస్తున్నారు. పవర్ ఫుల్ పాత్రలను ప్రగతికి అందరూ ఆఫర్ చేస్తున్నారు. ఇంతకు ముందులా ఏడుపు గొట్టు పాత్రలను ప్రగతి ఇప్పుడు చేయడం లేనట్టుంది. ఇప్పటికీ ప్రగతి తన ఫిట్ నెస్ కోసం శ్రమిస్తూనే ఉంది. రోజూ వర్కవుట్లు చేయడం మాత్రం మరిచిపోదు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చెమట చిందించాల్సిన సమయం అంటూ తెగ బరువులు మోసేస్తోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి