Nirupam Paritala Balakrishna Akhanda Look
Nirupam Paritala : నిరుపమ్ సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు బుల్లితెరపై సీరియల్స్‌లో మాత్రమే కనిపించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం నిరుపమ్ బుల్లితెర పండుగల ఈవెంట్లలో నానా రచ్చ చేస్తున్నాడు. ప్రతీ స్పెషల్ ఈవెంట్‌లో నిరుపమ్ తన స్టైల్లో ఆకట్టుకుంటున్నాడు. ఇక కార్తీకదీపం ఫ్యామిలీ అంతా కూడా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి వంటలక్క, డాక్టర్ బాబు కలిసే వస్తారు. కొన్ని సార్లు డాక్టర్ బాబు తన పిల్లలు శౌర్య, హిమలతో కలిసి వస్తాడు.
Nirupam Paritala Balakrishna Akhanda Look
అయితే వాటికి సంబంధించిన అప్డేట్లు నిరుపమ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇస్తుంటాడు. నిరుపమ్ కార్తీకదీపం సీరియల్‌లో ఇచ్చే కౌంటర్లు, వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మాటకు మాట సమాధానం ఇస్తూ దుమ్ములేపుతాడు. అలానే నిరుపమ్ సోషల్ మీడియాలోనూ కౌంటర్లు వేస్తుంటాడు. ప్రాసతో అందరికీ పిచ్చెక్కిస్తుంటాడు. అలాంటి నిరుపమ్ తాజాగా బాలయ్య, ఆయన లుక్కు మీదే కౌంటర్లు వేసేశాడు.
Nirupam Paritala Balakrishna Akhanda Look
బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతోన్న అఖండ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. అందులో అఘోరగా బాలయ్య స్పెషల్ గెటప్పులో కనిపించాడు. అయితే అది లెజెండ్ సినిమా లుక్కులా ఉందనే ట్రోల్స్ వచ్చాయి. అది వేరే విషయం అనుకోండి. తాజాగా నిరుపమ్ కూడా ఇంచుమించు అదే గెటప్పులో కనిపించాడు. కానీ అది అఖండ లుక్కు కాదని, ఏంటో గెస్ చేయండి అంటూ అభిమానులకు చాలెంజ్ విసిరాడు. దసరా ఈవెంట్‌లో డ్యాన్స్ పర్ఫామెన్స్ లుక్కు అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
This website uses cookies.