Nirupam Paritala : బాలయ్య మీదే సెటైరా?.. డాక్టర్ బాబు మామూలోడు కాదు!

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 12, 2021, 2:35 pm

Nirupam Paritala : నిరుపమ్ సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు బుల్లితెరపై సీరియల్స్‌లో మాత్రమే కనిపించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం నిరుపమ్ బుల్లితెర పండుగల ఈవెంట్లలో నానా రచ్చ చేస్తున్నాడు. ప్రతీ స్పెషల్ ఈవెంట్‌లో నిరుపమ్ తన స్టైల్లో ఆకట్టుకుంటున్నాడు. ఇక కార్తీకదీపం ఫ్యామిలీ అంతా కూడా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి వంటలక్క, డాక్టర్ బాబు కలిసే వస్తారు. కొన్ని సార్లు డాక్టర్ బాబు తన పిల్లలు శౌర్య, హిమలతో కలిసి వస్తాడు.

Nirupam Paritala Balakrishna Akhanda Look

Nirupam Paritala Balakrishna Akhanda Look

 

అయితే వాటికి సంబంధించిన అప్డేట్లు నిరుపమ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇస్తుంటాడు. నిరుపమ్ కార్తీకదీపం సీరియల్‌లో ఇచ్చే కౌంటర్లు, వేసే పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మాటకు మాట సమాధానం ఇస్తూ దుమ్ములేపుతాడు. అలానే నిరుపమ్ సోషల్ మీడియాలోనూ కౌంటర్లు వేస్తుంటాడు. ప్రాసతో అందరికీ పిచ్చెక్కిస్తుంటాడు. అలాంటి నిరుపమ్ తాజాగా బాలయ్య, ఆయన లుక్కు మీదే కౌంటర్లు వేసేశాడు.

Nirupam Paritala : డాక్టర్ బాబు గెటప్ వైరల్

Nirupam Paritala Balakrishna Akhanda Look

Nirupam Paritala Balakrishna Akhanda Look

బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతోన్న అఖండ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. అందులో అఘోరగా బాలయ్య స్పెషల్ గెటప్పులో కనిపించాడు. అయితే అది లెజెండ్ సినిమా లుక్కులా ఉందనే ట్రోల్స్ వచ్చాయి. అది వేరే విషయం అనుకోండి. తాజాగా నిరుపమ్ కూడా ఇంచుమించు అదే గెటప్పులో కనిపించాడు. కానీ అది అఖండ లుక్కు కాదని, ఏంటో గెస్ చేయండి అంటూ అభిమానులకు చాలెంజ్ విసిరాడు. దసరా ఈవెంట్‌లో డ్యాన్స్ పర్ఫామెన్స్ లుక్కు అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp