Venu Swamy : జాత‌కాలు త‌ప్పైతున్నా వేణు స్వామి వెన‌క ప‌డుతున్న హీరోయిన్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Venu Swamy : జాత‌కాలు త‌ప్పైతున్నా వేణు స్వామి వెన‌క ప‌డుతున్న హీరోయిన్స్..!

Venu Swamy : గ‌త కొద్ది రోజులుగా వేణు స్వామి పేరు నెట్టింట తెగ మారుమ్రోగిపోతుంది. ఆయ‌న నాగ చైత‌న్య‌, స‌మంత విడిపోతార‌ని చెప్పి వార్త‌ల‌లో నిలిచారు. సెలబ్రిటీల జాతకాలను బట్టి.. వారి వారి విజయాలను అపజయాలను అంచనా వేసే వేణు స్వామి.. ఈ మ‌ధ్య మాత్రం అంత‌గా అంచ‌నా వేయడం లేదు. ఏపీలో మరో సారి జగన్ గెలవడం ఖాయం అంటూ ఇటీవల జోస్యం చెప్పారు. అయితే తన అంచనా తప్పడంతో..బేషరతుగా క్షమాపణ చెబుతూ తాజాగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 June 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : జాత‌కాలు త‌ప్పైతున్నా వేణు స్వామి వెన‌క ప‌డుతున్న హీరోయిన్స్..!

Venu Swamy : గ‌త కొద్ది రోజులుగా వేణు స్వామి పేరు నెట్టింట తెగ మారుమ్రోగిపోతుంది. ఆయ‌న నాగ చైత‌న్య‌, స‌మంత విడిపోతార‌ని చెప్పి వార్త‌ల‌లో నిలిచారు. సెలబ్రిటీల జాతకాలను బట్టి.. వారి వారి విజయాలను అపజయాలను అంచనా వేసే వేణు స్వామి.. ఈ మ‌ధ్య మాత్రం అంత‌గా అంచ‌నా వేయడం లేదు. ఏపీలో మరో సారి జగన్ గెలవడం ఖాయం అంటూ ఇటీవల జోస్యం చెప్పారు. అయితే తన అంచనా తప్పడంతో..బేషరతుగా క్షమాపణ చెబుతూ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే సెంట్రల్లో మోదీ ఆదిపత్యం తగ్గుతుందంటూ.. తాను చెప్పిన విషయం నిజమైందని.. కానీ ఏపీ ఫలితాల్లోనే తన అంచనా 100 శాతం తప్పిందంటూ చెప్పారు. అయినా తనను నమ్మి ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారికి దన్యవాదాలు తెలియజేశారు.

Venu Swamy హీరోయిన్స్ క్యూ..

వేణు స్వామి జాత‌కాలు త‌ప్పుతున్నా కూడా హీరోయిన్స్ మాత్రం ఆయ‌న‌తో జాత‌కాలు చెప్పించుకునేందుకు క్యూ క‌డుతున్నారు. ఆయన చెప్పింది జరగకపోయినా దానిని కవర్ చేసుకునే నైపుణ్యం కూడా వేణు స్వామి దగ్గర ఉంది. అందుకే వాళ్లు ఆయ‌న వెన‌క‌ప‌డుతున్నార‌ని అంటున్నారు. . డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వేణు స్వామి జాత‌కాలు అంతగా వ‌ర్క‌వుట్ కాక‌పోయిన ఇత‌ర ఇండ‌స్ట్రీల నుండి కూడా ఆయ‌న‌తో పూజ‌లు చేయించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. తాజాగా కన్నడ హీరోయిన్ నిశ్విక వెనుస్వామి దగ్గరకు వచ్చి పూజలు చేయించుకున్నారు.

Venu Swamy జాత‌కాలు త‌ప్పైతున్నా వేణు స్వామి వెన‌క ప‌డుతున్న హీరోయిన్స్

Venu Swamy : జాత‌కాలు త‌ప్పైతున్నా వేణు స్వామి వెన‌క ప‌డుతున్న హీరోయిన్స్..!

నిశ్విక 2018లో హీరోయిన్ గా కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 28 ఏళ్ళ నిశ్విక కన్నడలో వరుస చిత్రాలు చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంది. రష్మిక, నిధి అగర్వాల్ లాంటి క్రేజీ హీరోయిన్లు వేణు స్వామిని నమ్మడంతో నిశ్విక లాంటి వారు కూడా ఆయన కోసం వస్తున్నారు. జాత‌కాలు తేడా కొడుతున్నా కూడా వేణు స్వామి క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదుగా అంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది