Nithin remove Rashmika in his movie
యంగ్ హీరో నితిన్ త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందనను సెలెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా నుంచి రష్మిక మందన తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నితిన్ వరుస ఫ్లాఫులతో సతమతమవుతున్నారు. ఈసారైనా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేయబోయే సినిమాలో హీరోయిన్గా రష్మిక మందనను సెలెక్ట్ చేశారు.
కానీ రష్మిక డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో రష్మిక నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘ భీష్మ ‘ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక రష్మికను హీరోయిన్గా ‘ ఛలో ‘ సినిమాతో పరిచయం చేసింది వెంకీ కుడుములనే. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రష్మిక ప్రస్తుత సౌత్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇటీవల బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి అక్కడ తనదైన స్టైల్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప సినిమాలో నటిస్తోంది.
Nithin remove Rashmika in his movie
రష్మిక డేట్స్ దొరకక నితిన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీలను తీసుకుంటున్నట్లు సమాచారం. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీ లీల ప్రస్తుతం ఏడు సినిమాలు చేస్తోంది. భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద చిత్రాల షూటింగ్ చివరి దశలో ఉంది. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ యాభై శాతం షూటింగ్ జరుపుకున్నాయి. మరొ కన్నడ సినిమా కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నితిన్ మూవీకి శ్రీలీల సైన్ చేస్తుందో లేదో చూడాలి. పరువైపు నితిన్ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.