Home » Entertainment » Nithya Menon Marriage News
Entertainment

Nithya Menon : ఆ స్టార్ హీరో తో నిత్యమీనన్ పెళ్లి .. డేట్ కూడా ఫిక్స్ ??

Authored By
aruna
The Telugu News | Published on: August 23, 2023, 11:00 am
Advertisement

Nithya Menon : మలయాళ బ్యూటీ నిత్యామీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘ అలా మొదలైంది ‘ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం నిత్యామీనన్ కు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదన్నట్లు కనిపిస్తుంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ భీమ్లా నాయక్ ‘ సినిమాలో నటించారు.

Advertisement

ఇక ఆమధ్య సూపర్ స్టార్ ధనుష్ నటించిన ‘ తిరు ‘ సినిమాలో నిత్యమీనన్ నటించింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలో నిత్యామీనన్ కనిపించడం లేదు. ఇదంతా పక్కన పెడితే నిత్యామీనన్ పెళ్లి గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై నిత్యామీనన్ ఇప్పటివరకు స్పందించలేదు. సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇస్తుందేమో అని అభిమానులు అంటున్నారు. అయితే తమిళ మీడియాలో నిత్యామీనన్ పెళ్లి నిజమే అంటూ ఇండస్ట్రీ కి చెందిన కొందరు చెబుతున్నారు. దీంతో నిత్యమీనన్ పెళ్లి నిజమే అయి ఉంటుందని జనాలు భావిస్తున్నారు.

Nithya Menon marriage news

Advertisement

నిత్యామీనన్ తన స్నేహితుడు అయిన మలయాళ హీరోతో చాలా రోజులుగా ప్రేమలో ఉందని, ఈ ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు ఎప్పుడో తెలుసు అని, కానీ సినిమాలో రాణించాలనే ఉద్దేశంతో పెళ్లి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఇటీవల నిత్యామీనన్ కి సినిమా ఆఫర్లు తగ్గడంతో ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అవ్వాలని చూస్తుందట. ప్రస్తుతం పెళ్లి ముహూర్తాలు కూడా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి నిత్యమీనన్ తన పెళ్లికి సంబంధించిన వార్తను త్వరలోనే చెప్పబోతుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. దీనిపై నిత్యామీనన్ స్పందించాల్సి ఉంటుంది లేదంటే ఇలాంటి వార్తలు ఆగకుండా వస్తూనే ఉంటాయి. మరి నిత్యామీనన్ ఏం చేస్తుందో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి