Chalaki Chanti : ఆ నలుగురి నాశనాన్ని కోరుకుంటున్న చలాకీ చంటి హాట్ కామెంట్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chalaki Chanti : ఆ నలుగురి నాశనాన్ని కోరుకుంటున్న చలాకీ చంటి హాట్ కామెంట్స్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 April 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Chalaki Chanti : ఆ నలుగురి నాశనాన్ని కోరుకుంటున్న చలాకీ చంటి హాట్ కామెంట్స్‌..!

Chalaki Chanti : బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచిత నటుడు చలాకి చంటి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఆయన, బిగ్ బాస్ షోలో కూడా తనదైన వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే బిగ్ బాస్ అనంతరం ఆయన పెద్దగా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించలేదు. ఈ గ్యాప్ సమయంలో చంటి అనారోగ్యానికి గురై, గుండెపోటుతో హాస్పిటల్ పాలయ్యారు. అయితే ఆ సమయంలో తనకు సినీ పరిశ్రమలోని ఎవరూ సహాయం చేయలేదని, తాను ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంగా మాట్లాడారు.

Chalaki Chanti ఆ నలుగురి నాశనాన్ని కోరుకుంటున్న చలాకీ చంటి హాట్ కామెంట్స్‌

Chalaki Chanti : ఆ నలుగురి నాశనాన్ని కోరుకుంటున్న చలాకీ చంటి హాట్ కామెంట్స్‌..!

Chalaki Chanti  హాస్పటల్ లో ఉంటె ఎవ్వరు సాయం చేయలేదు – చలాకీ చంటి

“ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనం బతుకుతాం, లేకుంటే ఎవరూ పట్టించుకోరు” అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు, కేవలం కొంతమంది పరామర్శించి వెళ్లారని, కానీ ఎవరూ సహాయం చేయలేదని అన్నారు. ఇదే కాకుండా తాను బుల్లితెరలో మంచి అవకాశాలు పొందిన సమయంలో, కొందరు కావాలని తనను తొక్కేసి, తన అవకాశాలను లాక్కొవడానికి ప్రయత్నించారని అన్నారు.

తన జీవితాన్ని తలకిందులు చేసిన నలుగురు వ్యక్తులు ఎప్పటికీ బాగుపడరని, వారు నాశనం అవుతారనే నమ్మకంతో తాను ఉన్నానని చంటి కఠిన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ నలుగురు ఎవరు అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. చంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాలు, తనపై జరిగిన కుట్రల గురించి బహిరంగంగా చెప్పడంతో చలాకి చంటి మాటలు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది