Varsha : వర్ష ఇమాన్యుయేల్ పరువుపోయింది.. అంత మాట అనేసిన నూక‌రాజు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Varsha : వర్ష ఇమాన్యుయేల్ పరువుపోయింది.. అంత మాట అనేసిన నూక‌రాజు

Varsha  : బుల్లితెరపై వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ ఇప్పుడు అందరికీ వెగటుపుట్టేసింది. ఒకప్పుడు వారిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని జనాలు కూడా ఫీలయ్యారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, కలర్ ఫోటో కాంబో అంటూ అందరూ ఆ జోడి మీద బాగానే ఇంట్రెస్ట్ చూపించారు. కానీ రాను రాను వారు చేసే అతిని చూసి అందరికీ విసుగు పుట్టింది. చివరకు చిరాకు పుట్టింది. బయటి జనాలే కాదు ఇప్పుడు అందులో ఉండే ఆర్టిస్టులే బహిరంగంగా వర్ష […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :4 November 2021,3:40 pm

Varsha  : బుల్లితెరపై వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ ఇప్పుడు అందరికీ వెగటుపుట్టేసింది. ఒకప్పుడు వారిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందని జనాలు కూడా ఫీలయ్యారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, కలర్ ఫోటో కాంబో అంటూ అందరూ ఆ జోడి మీద బాగానే ఇంట్రెస్ట్ చూపించారు. కానీ రాను రాను వారు చేసే అతిని చూసి అందరికీ విసుగు పుట్టింది. చివరకు చిరాకు పుట్టింది. బయటి జనాలే కాదు ఇప్పుడు అందులో ఉండే ఆర్టిస్టులే బహిరంగంగా వర్ష ఇమాన్యుయేల్ మీద పంచులు వేసేస్తున్నారు.

Nookaraju Satires On Varsha And Emmanuel In Rechipodam Brother

Nookaraju Satires On Varsha And Emmanuel In Rechipodam Brother

బుల్లితెరపై ఈ ఇద్దరూ కాస్త శ్రుతిమించారు. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేయడం, ఎంతో ఎమోషనల్ అవ్వడం, టీఆర్పీ స్టంట్లు చేయడం, చివరకు పెళ్లి అంటూ డ్రామాలు ఆడి, ఈవెంట్‌ కోసం పెళ్లి చేసుకోవడం వంటి వాటితో ఈ జోడి విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. అలా మొత్తానికి ఈ జోడిని ఇప్పుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోవడం లేదు. ఇక జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్ వంటి షోలోని ఆర్టిస్ట్‌లు ఆ జోడి మీద నానా రకాల పంచులు వేస్తున్నారు.

Varsha : ఇమాన్యుయేల్ వర్ష పరువుతీసిన నూకరాజు

Nookaraju Satires On Varsha And Emmanuel In Rechipodam Brother

Nookaraju Satires On Varsha And Emmanuel In Rechipodam Brother

మరీ ముఖ్యంగా నూకరాజు అయితే ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఆడుకుంటున్నాడు. అతనిలా ఇమిటేట్ చేసి పరువుతీస్తున్నాడు. తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షోలో నూకరాజు నిజంగానే రెచ్చిపోయాడు. టాపు లేచిపోద్ది అనే పాటకు పేరడి పాడాడు. అది కూడా వర్ష ఇమాన్యుయేలో జోడి మీద. కోతి మొకం వర్షతో నువ్ రొమాన్స్ చేస్తుంటే.. కాలి పోద్ది.. మాకు కాలి పోద్ది అంటూ టాపు లేచిపోద్ది అనే పాటను పేరడిచేసేశాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది