Jr NTR Dragon Movie : ఎన్టీఆర్ డ్రాగన్ విషయం లో ఫ్యాన్స్ భయపడుతున్న పాయింట్ ఇదే..!
Jr NTR Dragon Movie : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా తారక్ భుజానికి గాయం కావడంతో షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. హీరో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో, సినిమా రిలీజ్ డేట్ మారుతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ.. ఇటీవల జరిగిన ‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. మరో రెండు వారాల్లో డ్రాగన్ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని, ఫిబ్రవరి నాటికి టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసి, ప్లాన్ చేసినట్లుగానే జూన్‌లోనే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
Jr NTR Dragon Movie : ఎన్టీఆర్ డ్రాగన్ విషయం లో ఫ్యాన్స్ భయపడుతున్న పాయింట్ ఇదే..!
Jr NTR Dragon Movie గాయం, వాయిదాల వార్తలు.. మళ్లీ మొదలైన కన్ఫ్యూజన్!
నిర్మాత రవిశంకర్ అంత క్లియర్‌గా చెప్పి రెండు వారాలు కూడా గడవకముందే, టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు మరో కొత్త ప్రచారం ఊపందుకుంది. సినిమా షూటింగ్ మేకర్స్ అనుకున్నంత స్పీడ్‌గా జరగడం లేదని, జూన్ డెడ్‌లైన్‌ను అందుకోవడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ జూన్ మిస్ అయితే, సినిమాను ఏకంగా 2027 దసరా బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ, ఈ వాయిదా వార్తలపై మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి కొత్త ప్రకటన రాలేదు. అధికారికంగా వాళ్లు లాక్ చేసిన డేట్ మాత్రం ఇంకా జూన్ 11 మీదే ఉంది.
అభిమానుల్లో ఈ రేంజ్ డౌట్స్ రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఎన్టీఆర్ గాయం తీవ్రత కారణంగా డాక్టర్లు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తప్పనిసరి అని సూచించారు. దీంతో శ్రీలంకలో ప్లాన్ చేసిన భారీ షెడ్యూల్ అర్ధాంతరంగా ఆగిపోయింది. వాస్తవానికి ఆ షెడ్యూల్‌లో ఒక కీలకమైన పాటతో పాటు, యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉందట. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ కావడంతో, ఏ ఒక్క షెడ్యూల్ వెనక్కి జరిగినా.. ఆ ప్రభావం తర్వాతి ప్లానింగ్ మొత్తం మీద పడుతుంది. కాల్షీట్లు, లొకేషన్లు అన్నీ మళ్లీ సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
దసరాకి షిఫ్ట్ అవుతుందా? అసలు సవాల్ ఆ నాలుగు నెలలే!
కేవలం షూటింగ్ పూర్తయినంత మాత్రాన డ్రాగన్ పనులు అయిపోయినట్లు కాదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలకు టేకింగ్ ఎంత ముఖ్యమో, పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ (VFX), భారీ యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ కూడా అంతే ముఖ్యం. వీటికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. మేకర్స్ చెబుతున్న లెక్కల ప్రకారం.. ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తయితే, జూన్ రిలీజ్‌కు దాదాపు నాలుగు నెలల సమయం మాత్రమే చేతిలో ఉంటుంది. ఒకవేళ ప్యార్లల్‌గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగితే ఆ గ్యాప్ సరిపోవచ్చు. కానీ, అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఇంకో నెల, రెండు నెలలు ఆలస్యమైతే మాత్రం జూన్ రిలీజ్ టార్గెట్ మీద తీవ్రమైన ఒత్తిడి పడటం ఖాయం.
అయితే, ఇక్కడ నిర్మాత రవిశంకర్ చెప్పిన మాటను కూడా మనం తేలికగా తీసుకోలేం. ఎలాంటి పెద్ద బ్రేక్స్ లేకుండా కంటిన్యూయస్‌గా షూటింగ్ జరిపి ఫిబ్రవరికి పూర్తి చేస్తామని ఆయన ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. గతంలోనూ ‘డ్రాగన్’ ప్రాజెక్ట్ లేట్ అవుతోందన్న పుకార్లు వచ్చినప్పుడు, మైత్రీ టీమ్ వెంటనే అలెర్ట్ అయ్యి డైరెక్ట్‌గా స్పందించింది. కాబట్టి, ఇప్పుడు వినిపిస్తున్న ఈ దసరా వాయిదా టాక్‌ను ఇప్పుడే నిజమని నమ్మడానికి వీల్లేదు. డ్రాగన్ టీమ్‌కు అసలు సిసలైన టెస్ట్ రాబోయే ఈ నాలుగైదు నెలలే. ఎన్టీఆర్ సెట్స్‌లో ఎంత రెగ్యులర్‌గా పాల్గొంటారు? డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫిబ్రవరి టార్గెట్‌ను ఏ రేంజ్‌లో అందుకుంటారు? అన్న అంశాల మీదే ‘జూన్ 11’ రిలీజ్ అనేది ఆధారపడి ఉంది.
