Nuvvu Nenu Prema 31 July Today Episode : విక్కీ, పద్దు గొడవను అరవింద చూస్తుందా? మురళి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? పద్దు మళ్లీ భక్త ఇంటికి వెళ్తుందా?

Advertisement
Advertisement

Nuvvu Nenu Prema 31 July Today Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 31 జులై 2023, సోమవారం ఎపిసోడ్ 376 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన రూమ్ లోకి వెళ్లి పిచ్చిపిచ్చిగా చేస్తుంది పద్మావతి. దీంతో విక్రమ్ అక్కడి వెళ్లి తనను ఆపుతాడు. నేను ఎందుకు ఇలా ఉన్నానో మీకు తెలియదా? నా కన్నీళ్లను చూసి కూడా నా బాధ అర్థం కావడం లేదా? నన్ను బెదిరించి కారణం చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. వాళ్లందరూ నన్ను ఇప్పుడు కానిదానిలా చూస్తున్నారు. అనాథనైన నన్ను తీసుకెళ్లి పెంచారు. కానీ.. ఇప్పుడు మా నాయిన వచ్చినా నన్ను తీసుకెళ్లలేదు. మా నాయినతో ఎన్నో మాట్లాడాలని సంతోషపడ్డా. మీ వల్ల నేను పరాయిదాన్ని అయ్యాను. కానీ.. నన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని మా నాయిన ఇప్పుడు నన్ను పట్టించుకోకుండానే వెళ్లిపోయాడు. ఆ బాధ ఎలా ఉంటదో మీకు తెలుసునా. ఆడ్నే చావాలనిపించింది అని అంటుంది. నిన్ను తీసుకెళ్లడం, తీసుకెళ్లకపోవడం అనేది మీ నాన్న పర్సనల్ అంటాడు విక్కీ. అరవింద భర్త మురళి ఇవన్నీ వింటాడు. ఏంటి వీళ్ల గొడవ అని అనుకుంటాడు. వెంటనే అరవిందను పిలవాలి అని అనుకుంటాడు.

Advertisement

Advertisement

వెంటనే అరవింద దగ్గరికి వెళ్తాడు మురళి. ఏమైంది అని అడుగుతుంది. త్వరగా నువ్వురా అంటాడు. ఏమైంది చెప్పండి అంటుంది. మీరేమో విక్కి, పద్మావతి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని అనుకుంటున్నారు. విక్కి అలాగే చెప్పాడు కదా. వాళ్లిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అనిపిస్తోంది. వాళ్లు గొడవ పడుతున్నారు. నా కళ్లతో నేను చూశాను. చెబితే నువ్వు నమ్మవని నీకు కూడా చూపిద్దామని వచ్చాను. త్వరగా రా రాణమ్మ అని తనను తీసుకెళ్తాడు మురళి. నాకే వార్నింగ్ ఇస్తావా.. ఇప్పుడు నీకు ఉంటుంది చూడు అని మనసులో అనుకుంటాడు మురళి. నీ విషయంలో నేను క్లారిటీగా ఉన్నాను. నిన్ను ఎలా ట్రీట్ చేయాలో చేయకూడదో అది మీ వాళ్ల ఇష్టం. నన్ను అనే అర్హత నీకు లేదు అంటాడు విక్కి. మీరు పెట్టిన బాధ చాలదా. ఏ తప్పు చేయకపోయినా అయిన వాళ్లు కళ్ల ముందే చీదరించుకొని వెళ్లిపోతా ఉంటే ఆ బాధ నాకు తెలుస్తది కానీ.. మీకు ఎట్లా తెలుస్తది అంటుంది పద్దు. అయినా నా బాధ కూడా మీకు సంతోషమే కదా. దానికే మళ్లా మళ్లా ఏడిపిస్తున్నారు అంటుంది పద్మావతి.

దీంతో నీకు ఒక్కదానికేనా బాధ. నాకు లేదా. అసలు బాధంటే నాది అంటాడు విక్కీ. ప్రేమించాను.. ప్రాణం పెట్టాను. కానీ.. నువ్వేం చేశావు. నమ్మక ద్రోహం చేశావు అంటాడు. నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలుసా అంటాడు. మీ బాధకు నేనే కారణం అయినప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు. బాధపడుతున్నానని మీరు చెప్పుకోవడం తప్పు కాదు. ఆ బాధ పేరుతో అందరినీ బాధపెడుతున్నారు చూడండి అది పెద్ద తప్పు అంటుంది పద్మావతి. నాదే తప్పంటావా అంటాడు విక్రమ్. ఇంతలో అరవింద, మురళి ఇద్దరూ వస్తారు. వాళ్లను చూసి షాక్ అవుతాడు విక్కీ. ఏంట్రా ఇది. ఇద్దరూ గొడవ పడుతున్నారు ఎందుకు అని అడుగుతుంది. దీంతో గొడవా.. అదేం లేదు అక్క అంటాడు. ఏం లేకపోతే పద్మావతి పైన ఎందుకు అలా అరుస్తున్నావు అంటుంది. పద్మావతి ఎందుకు అలా అరుస్తుంది. ఏదో జరిగింది. అదేంటో చెప్పు అని అడుగుతుంది. దీంతో విక్కీ ఏం మాట్లాడడు. అక్కకు నిజం తెలిస్తే తట్టుకోలేదు. ఎలాగైనా నిజం చెప్పకుండా మేనేజ్ చేయాలి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema 31 July Today Episode : ఏమైందని పద్మావతిని అడిగిన అరవింద

అసలు ఏమైందో నువ్వైనా చెప్పు పద్మావతి అని అడుగుతుంది అరవింద. దీంతో నా మీద కోపంతో పద్మావతి నిజం చెప్పినా చెబుతుంది అని అనుకొని నేను చెబుతా అక్క. ఇందాకా పద్మావతి వాళ్ల నాన్న గారు వచ్చారు కదా. అనును తప్ప తనను తీసుకెళ్లనందుకు చాలా బాధపడుతోంది. ఎంత నచ్చచెప్పినా మీ నాన్నగారు వినలేదు అని చెబితే తను నమ్మడం లేదు. తను బాధలో ఉందని ప్రేమతోనే కాస్త గట్టిగా అరిచాను. అంతే తప్ప మా మధ్య ఏం జరగలేదు అని అంటాడు విక్కీ. దీంతో అంతేనా.. నిజంగానే ఏం లేదు కదా అంటుంది అరవింద. దీంతో నేను ఎంతో ప్రేమించే పద్మావతితో నేనెందుకు గొడవ పడతాను చెప్పు. కలలో కూడా తనకు ఏ కష్టం రానివ్వను అంటుంది. అసలు మా మధ్య గొడవ జరుగుతోందని నీకెవరు చెప్పారు అని అడుగుతాడు విక్కీ. దీంతో మీ బావ గారు చెప్పారు అంటుంది. దీంతో ఏం బావ.. గొడవకు, ప్రేమగా మాట్లాడటానికి తేడా తెలియదా అంటాడు. నువ్వే ప్రేమగా ఉండాలని చెప్పావు కదా. ఇప్పుడు అదే గొడవగా ఎలా అనిపించింది అని అంటాడు విక్కీ.

నువ్వైనా పద్మావతిని వాళ్ల ఇంటికి తీసుకెళ్లు అంటుంది అరవింద. త్వరగా బట్టలు సర్దుకోండి అని చెప్పి అరవింద అక్కడి నుంచి వెళ్తుంది. దీంతో ఇప్పుడైనా నిజం చెప్పొచ్చు కదా అని అడుగుతుంది పద్మావతి. దీంతో మా అక్క సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. మీ అక్క సంతోషం కోసం ఏదైనా చేసే మీరు నన్నెందుకు ఇంతలా బాధపెడుతున్నారు అని మనసులో అనుకుంటుంది పద్మావతి.

మరోవైపు అనును రెస్ట్ తీసుకో అని భక్త చెబుతాడు. లక్ష్మీ నువ్వు చెప్పినట్టు వినే వాళ్లే నా బిడ్డలు. నేను తలదించుకునేలా చేసేవాళ్లు కాదు అంటాడు భక్త. నాకు ఇప్పుడు అను ఒక్కతే కూతురు అంటాడు. పద్మావతి ఎలా ఉంది అని అడుగుతుంది లక్ష్మీ. దీంతో రోజూ మీ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. తను వస్తానన్నా నాన్న తీసుకురాలేదు అని అంటుంది అను.

మరోవైపు పద్దు, విక్కీ ఇద్దరూ బ్యాగు సర్దుకొని మెట్లు దిగుతూ ఉంటారు. పద్మావతి మెట్టు జారబోగా.. తనను పట్టుకుంటాడు విక్కీ. జాగ్రత్త పద్మావతి అంటాడు విక్కీ. ఆ తర్వాత పద్దును తీసుకొని వాళ్ల ఇంటికి వెళ్తాడు. పద్దును చూసి ఇంట్లోకి రానివ్వడు భక్త. తన కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించడు భక్త. దీంతో తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లేందుకు బయటికి వస్తుంది పద్దు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Daily One Carrot : మీరు ప్రతి రోజు ఒక తాజా పచ్చి క్యారెట్ తిన్నారంటే… దీని ప్రయోజనాలు మతిపోగడతాయి…?

Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…

42 minutes ago

Toothpaste : ఇంకేంముంది టూత్ పేస్ట్ కూడా కల్తీనే… ప్రాణాలు తీసే లోహాలు… ఆ బ్రాండ్ లిస్ట్ తెలుసా…?

Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…

2 hours ago

TGSRTC Jobs : త్వరలో TGSRTC లో 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్..!

TGSRTC Jobs  తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…

3 hours ago

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

4 hours ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

5 hours ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

6 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

7 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

8 hours ago