Okkadu Movie : సూపర్ స్టార్ కృష్ణ ముద్దుల తనయుడు మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో ప్రిన్స్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన మహేష్ బాబు . రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతికి మహేష్ సినిమా రావడం హిట్టు కొట్టడం ఇది మొదటిసారి కాదు 17 ఏళ్ల క్రితం మహేష్ ఒక్కడు సినిమా కూడా సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టింది. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. 2003 లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా టైటిల్ విషయం లో వివాదం లో ఇరుక్కున విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ఈ సినిమా కథను దర్శకుడు గుణశేఖర్ తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి రాయడం ప్రారంభించారు. రాజకుమారుడు సినిమా షూటింగ్ నడుస్తుండగా అదే వైజయంతి మూవీస్ బ్యానర్ లో గుణశేఖర్ చిరంజీవితో చూడాలని ఉంది సినిమా నిర్మిస్తున్నారు. ఆ సమయంలో మహేష్ బాబుతో ఏర్పడిన పరిచయంతో గుణశేఖర్ ఈ కథను మహేష్‌కు చెప్పారు. మహేష్‌కు వెంటనే కథ నచ్చేసింది. అయితే ఆ తర్వాత గుణశేఖర్‌కు చిరంజీవితో చేసిన మృగరాజు రూపంలో పెద్ద డిజాస్టర్ ఎదురైంది. అయినా మహేష్ బాబు మాత్రం గుణశేఖర్ పై ఎంతో నమ్మకంతో ఉన్నాడు. అయితే ఇద్దరు నిర్మాతలు పక్కకు తప్పుకోవడంతో ఎంఎస్ రాజు ఫ్రేమ్లోకి వచ్చారు
2002లోనే 14 కోట్ల రూపాయలతో ఒక్కడు సినిమా తెరకెక్కింది. సినిమా తొలి రోజు తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు ముందుగా అతడే ఆమె సైన్యం అన్న టైటిల్ పెట్టాలని అనుకున్నారు. అయితే అప్పటికే ఆ టైటిల్ మరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో గుణశేఖర్ ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. ఆ తర్వాత కబడ్డీ అన్న పేరు అనుకున్నారు. చివరకు గుణశేఖర్ ఒక్కడు అన్న టైటిల్ చెప్పిన వెంటనే మహేష్ ఓకే చెప్పేశారు. అలా ఒక్కడు సినిమా టైటిల్ పుట్టి మహేష్ కెరీర్ ను మార్చేసింది. అప్పటివరకు ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రమే చూసే మహేష్ సినిమాలకు యూత్ కనెక్ట్ అయిన సినిమా ఒక్కడు. ఆ సినిమాతోనే హీరోగా మహేష్ కు సూపర్ మైలేజ్ వచ్చింది
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.